'స్పిరిట్'లో మరో బిగ్ స్టార్.. వంగా ప్లాన్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత స్పిరిట్ సినిమా వర్క్స్ తో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే.;

Update: 2025-06-19 11:15 GMT

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత స్పిరిట్ సినిమా వర్క్స్ తో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇటీవల పూర్తి చేశారు సందీప్. ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.


మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. దీంతో క్యాస్టింగ్ ను ఇప్పుడు ఫైనల్ చేసిన పనిలో పడ్డారట వంగా. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఫిమేల్ లీడ్ రోల్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆమె బదులు త్రిప్తీ డిమ్రీని ఫిక్స్ చేశారు. సందీప్ యానిమల్ తోనే అమ్మడు లైమ్ లైట్ లోకి వచ్చింది.

ఇప్పుడు యాక్టర్ ఉపేంద్ర లిమాయేను స్పిరిట్ మూవీకి గాను సందీప్ వంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే యానిమల్ లో ఆయన మెషిన్ గన్ అమ్మే ఫ్రెడ్డీ పాత్రలో కనిపించి తన యాక్టింగ్ తో మెప్పించారు. ఆ తర్వాత తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాంలో సందడి చేశారు. మంచి కామెడీతో సినిమా ప్రియులను ఆకట్టుకున్నారు.

ఇప్పుడు స్పిరిట్ లో నటించనున్నట్లు ఉపేంద్ర పోస్ట్ ద్వారా తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన హైదరాబాద్ లోని సందీప్ కొత్త ఆఫీస్ భద్రకాళి పిక్చర్స్ కు వెళ్లారు. అక్కడ సందీప్, ప్రణయ్ బ్రదర్స్ ను కలిశారు. ఆ తర్వాత వారితో దిగిన ఫోటోను షేర్ చేశారు. భద్రకాళి పిక్చర్స్ కొత్త ఆఫీస్ లో రెడ్డి బ్రదర్స్ ను కలవడం సంతోషంగా ఉందని ఉపేంద్ర తెలిపారు.

రెడ్డి బ్రదర్స్ హై స్పిరిట్ లో ఉన్నారంటూ స్పిరిట్ మూవీలో నటిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈసారి సందీప్.. ఉపేంద్ర కోసం ఏ పాత్ర రాసుకున్నారో అన్న విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. సరైన.. కీలక పాత్రలోనే స్పిరిట్ లో ఉపేంద్ర కనిపించనున్నారని తెలుస్తోంది.

అయితే ఉపేంద్ర పోస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి ఫోటో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సందీప్ ఆఫీస్ లో.. ఆరాధన సినిమాలోని చిరంజీవి లుక్ ఫ్రేమ్ రూపంలో ఉన్న విషయం తెలిసిందే. దాని వద్దే సందీప్, ప్రణయ్ తో ఉపేంద్ర పిక్ దిగడం గమనార్హం. కాగా, టీ- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, సందీప్, ప్రణయ్ భారీ బడ్జెట్ తో స్పిరిట్ ను నిర్మిస్తున్నారు. మరి ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News