స్పిరిట్ వాయిదా రూమర్ వెనుక అసలు లెక్క ఇదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ పై గత కొంతకాలంగా నెలకొన్న రిలీజ్ డేట్ డిస్క‌ష‌న్ కు తాజాగా కొత్త మలుపు వచ్చింది.

Update: 2026-08-19 05:52 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ పై గత కొంతకాలంగా నెలకొన్న రిలీజ్ డేట్ డిస్క‌ష‌న్ కు తాజాగా కొత్త మలుపు వచ్చింది. మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా జూన్‌కు వాయిదా పడొచ్చంటూ బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం మొదలైంది. అయితే ఈ రూమ‌ర్ల‌కు చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన క్లారిటీతో ప్రస్తుతం నెలకొన్న అనుమానాలకు తెరపడినట్లయింది. అసలు ఈ వాయిదా ప్రచారం ఎందుకు మొదలైంది? దాని వెనుక ఉన్న లెక్క ఏంటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

స్పిరిట్ షూటింగ్‌కు ఇంకా కొంచెం టైమ్ అవసరమనే సమాచారం ఈ రూమర్లకు ప్రధాన కారణంగా కనిపించింది. దాదాపు 75 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందన్న డిస్క‌ష‌న్ నేపథ్యంలో.. ప్రభాస్ ఇప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కూడా ఈ లెక్కలకు బలాన్ని చేకూర్చింది. ఒకవైపు ప్రస్తుత కమిట్‌మెంట్లు, మరోవైపు స్పిరిట్ కోసం అవసరమైన లాంగ్ షెడ్యూల్స్.. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ ను కంప్లీట్ చేసి మార్చి 5కి సినిమాను రెడీ చేయడం సాధ్యమేనా అనే సందేహాలు మొదలయ్యాయి.

ఇదే సమయంలో 2027 ఈద్ సీజన్ చుట్టూ మరో కీలక డిస్క‌ష‌న్ కూడా నడిచింది. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా మార్చి 9 లేదా 10న ప్రేక్షకుల ముందుకు రావచ్చనే వార్తలు వినిపించాయి. దీంతో స్పిరిట్ కూడా అదే రిలీజ్ విండోలో ఉంటే రెండు భారీ సినిమాల మధ్య పోటీ తప్పదనే విశ్లేషణలు వచ్చాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో స్క్రీన్లు, షోలు, డిస్ట్రిబ్యూషన్ పరంగా ఇలాంటి పోటీ ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. స్పిరిట్ ను జూన్‌కు మార్చే ప్రత్యామ్నాయ ఆలోచన ఉండొచ్చనే ప్రచారం మొదలైంది.

అయితే ఈ ఊహాగానాలకు నిర్మాతల వైపు నుంచి వచ్చిన రెస్పాన్స్ కీలకంగా మారింది. స్పిరిట్ రిలీజ్ ప్లాన్ లో ఎలాంటి మార్పు లేదని, ముందుగా అనౌన్స్ చేసిన‌ట్టుగానే మార్చి 5, 2027న సినిమాను తీసుకొచ్చేందుకు వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయ‌ని టీ-సిరీస్ క్లారిటీ ఇచ్చింది. దీంతో జూన్ వాయిదా రూమర్ మాత్రమే కాదు.. స్పిరిట్ మార్చి నుంచి వాయిదా ప‌డుతుంద‌నే ప్రచారానికి, ఫలితంగా సల్మాన్ సినిమాకు సోలో రిలీజ్ దక్కుతుందనే అంచనాలకు కూడా బ్రేక్ పడింది. దీంతో పెండింగ్ షూటింగ్, ప్రభాస్ కాల్షీట్లు, భారీ పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ మేకర్స్ మార్చి 5 టార్గెట్ ను ఎలా చేరుకుంటారన్నదే ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News