తారక్..చెర్రీ డార్లింగ్ ని ఫాలో అవ్వడం లేదే!
సినిమాల లైనప్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాలో అవుతోన్న సంగతి తెలిసిందే.;
సినిమాల లైనప్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాలో అవుతోన్న సంగతి తెలిసిందే. `బాహుబలి` తర్వాత ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేయడం..వాటి తర్వాత చేయాల్సిన ప్రాజెక్ట్ లు ముందుగానే సెట్ చేసి రెడీగా పెట్టుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో రిలీజ్ ల పరంగా పెద్దగా గ్యాప్ రావడం లేదు. ఒకేసారి రెండు రిలీజ్ లు జరగడం లేదంటే? ఏడాది గ్యాప్ లేకుండా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీంతో తారక్ ..చరణ్ `ఆర్ ఆర్ ఆర్` తర్వాత అలాంటి లైనప్ ఉండేలా చూసు కుంటున్నారు.
డార్లింగ్ మాత్రం పక్కా ప్లానింగ్ తో:
అంత వరకూ ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ కష్టంగా ఉండేది. దీంతో వారి ప్లానింగ్ కూడా మారడంతో వ్యత్యాసం తగ్గింది. అయితే ఓ విషయంలో మాత్రం తారక్..చరణ్ డార్లింగ్ ని అనుసరించడం లేదని చెప్పాలి. ప్రభాస్ ఏ సినిమా చేసినా అది రెండు బాగాలుగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. `బాహుబలి` అలాగే రిలీజ్ అయింది. 'సలార్-2', 'కల్కి 2' పూర్తి చేసి రిలీజ్ చేయాలి. అలాగే 'పౌజీ' కూడా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. 'స్పిరిట్' కూడా రెండు భాగాలు ఉండే అవకాశం ఉంది. స్టోరీ స్పాన్ ని బట్టి ఒక భాగమా? రెండు భాగాలా? అన్నది ముందే డిసైడ్ చేసుకుంటున్నారు.
ఇకపై కండీషన్లు అప్లై అంటారా?
దాన్ని బట్టి ఓ ప్లానింగ్ సిద్దం చేసుకుని డార్లింగ్ అండ్ కో ముందుకెళ్తుంది. అయితే తారక్ , చరణ్ మాత్రం రెండు రిలీజ్ లకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే మాట వినిపిస్తోంది. 'దేవర' సమయంలోనే ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు తారక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ `దేవర` ఆశించిన ఫలితం సాధించ కపోవడంతో? రెండవ భాగం విషయంలో గ్యాప్ తీసుకుంటున్నారు. `దేవర 2` తర్వాత మాత్రం తారక్ ఏ సినిమా చేసినా దానికి రెండవ భాగం ఉండ కూడదని ముందే కండీషన్ పెట్టబోతున్నాడుట.
రెండు భాగాలకు నో చెబుతున్నారా?
ఈ నేపథ్యంలో 'డ్రాగన్' కూడా ఒకే భాగంగా రిలీజ్ అవుతుందని సమాచారం. చరణ్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నాడుట. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` చేస్తున్నాడు. ఇది ఒకే భాగంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ 17 మొదలవుతుంది. ఇది కూడా సింగిల్ పార్ట్ గా రిలీజ్ అవుతుంది. 'రంగస్థలం'కి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది గానీ అందులో వాస్తవం తెలియదు. ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడం విషయంలో తారక్..చరణ్ ఒకేలా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.