నాలుగేళ్ల స్పిరిట్.. అడుగు ముందుకు పడలేదు కానీ..!
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ స్పిరిట్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. సందీప్ వంగ ఈ సినిమాను 2021 అక్టోబర్ 8న అనౌన్స్ చేశారు.;
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ స్పిరిట్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. సందీప్ వంగ ఈ సినిమాను 2021 అక్టోబర్ 8న అనౌన్స్ చేశారు. అంటే నేటితో నాలుగేళ్లు అన్నమాట. 4 ఇయర్స్ బ్యాక్ సినిమా అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. మధ్యలో సందీప్ వంగ యానిమల్ సినిమా తీశాడు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రణ్ బీర్ కపూర్ కెరీర్ లోనే సెన్సేషనల్ సినిమాగా యానిమల్ నిలిచింది.
ప్రభాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ అంతా..
ఇక నెక్స్ట్ నాలుగేళ్ల క్రితం అనౌన్స్ చేసిన స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నాడు సందీప్ వంగ. ప్రభాస్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ అంతా సిద్ధం చేసుకుని ఉన్నాడు. ఎప్పుడు ప్రభాస్ డేట్స్ ఇస్తే అప్పటి నుంచి షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఐతే ఈ సినిమాకు ముందు కమిటమైన సినిమాలను పూర్తి చేసి ప్రభాస్ స్పిరిట్ కోసం డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడట. ఇప్పటివరకు సందీప్ వంగ సినిమాల్లో హీరో ఇలాంటి ఆఫీసర్ రోల్ చేయలేదు. అర్జున్ రెడ్డిలో హీరో డాక్టరే కానీ అతనొక టిపికల్ మైండ్ సెట్ ఉన్న లవర్.. ఇక యానిమల్ లో నాన్న కోసం ఏదైనా చేసే క్యారెక్టర్. ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా అంతకుమించి క్యారెక్టరైజేషన్ రాసుకున్నాడట సందీప్ వంగ.
కొరియన్ యాక్టర్ డాంగ్ లీ..
తప్పకుండా ఈ రోల్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడట సందీప్ వంగ. సినిమాలో కొరియన్ యాక్టర్ డాంగ్ లీ ఉంటాడని టాక్. అంతేకాదు ఒకప్పటి హీరో తరుణ్ కూడా ప్రభాస్, సందీప్ వంగ స్పిరిట్ కోసం రంగంలోకి దించుతున్నారని తెలుస్తుంది.
సందీప్ వంగ సినిమా అంటే చాలు పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ మెంటల్ ఎక్కిపోతున్నారు. సినిమా ఫార్మెట్ మార్చే డైరెక్టర్స్ లిస్ట్ లో ఒకప్పుడు ఆర్జీవి గురించి ఎలా సర్ ప్రైజ్ అయ్యారో సందీప్ వంగ గురించి కూడా అలానే చెప్పుకుంటున్నారు. ప్రభాస్ స్పిరిట్ తర్వాత సందీప్ వంగ యానిమల్ పార్క్ ఇంకా విజయ్ దేవరకొండతో ఒక సినిమా రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.