ఓన్లీ మూవీస్.. ప్రభాస్ స్పెషల్ క్వాలిటీ అది!

ఎందుకంటే ప్రస్తుతం అనేక మంది హీరోలు.. పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా ఎందరో హీరోలు బ్రాండ్ ఎండార్స్ మెంట్ చేస్తున్నారు.;

Update: 2025-04-05 07:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈశ్వర్ మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు. వరల్డ్ వైడ్ గా అనేక దేశాల్లో అశేష అభిమాన గణం ప్రభాస్ సొంతమని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

అయితే ఇప్పటి వరకు అనేక హిట్స్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓవైపు మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్.. మరోవైపు హను రాఘవపూడితో సినిమాను పూర్తి చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీలు.. త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

ఆ రెండు సినిమాలు కాకుండా.. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేయనున్నారు డార్లింగ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ కు.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కికి తెరకెక్కనున్న సీక్వెల్స్ లో కూడా నటించనున్నారు. అలా కొన్నేళ్ల వరకు ప్రభాస్ ఫుల్ బిజీగా అన్నమాట. అంతే కాదు ఆయన ఫోకస్ అంతా సినిమాలపైనేనట.

ఎందుకంటే ప్రస్తుతం అనేక మంది హీరోలు.. పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా ఎందరో హీరోలు బ్రాండ్ ఎండార్స్ మెంట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం దూరంగా ఉంటారు. ఎన్నో భారీ ఆఫర్లు వస్తున్నా.. ఆయన వెంటనే రిజెక్ట్ చేస్తున్నారట.

ఫేమస్ కూల్ డ్రింక్ కంపెనీతోపాటు మరిన్ని సంస్థలు సంప్రదించినా కూడా ప్రభాస్ నో చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం తన దృష్టంతా మూవీలపైనే పెడుతున్నట్లు చెప్పారట. అయితే యాడ్ షూట్, ప్రమోషన్ కు వెళ్తే భారీ మొత్తంలో డబ్బులు వస్తాయన్న విషయం తెలిసిందే. రూ.కోట్లలో ఆఫర్స్ వస్తుంటాయి.

కానీ ప్రభాస్ ఇప్పటి వరకు ఒక్క బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేయలేదు. అయితే అలా ప్రమోట్ చేయడం తప్పేం కాదు. ఎవరి ఇష్టం వాళ్లదని చెప్పాలి. డార్లింగ్ మాత్రం ఆ జోలికి పోయేందుకు ఇష్టపడడం లేదు. తన కంప్లీట్ టైమ్ ను మూవీల కోసమే స్పెండ్ చేస్తూ.. వరుస సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అది ఆయనలో ఒక స్పెషల్ క్వాలిటీ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

Tags:    

Similar News