ప్రభాస్ 'రెబలియస్' ప్రాజెక్ట్.. ప్రశాంత్ కామెంట్..!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ ఇయర్ రాజా సాబ్ ని పూర్తి చేస్తున్నాడు;

Update: 2025-09-06 06:20 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ ఇయర్ రాజా సాబ్ ని పూర్తి చేస్తున్నాడు. అది డిసెంబర్ రిలీజ్ ఉండాల్సింది కానీ దాన్ని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఫౌజీ ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఐతే ప్రభాస్ తో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుందని వార్తలు వచ్చాయి. దాని గురించి ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. కానీ ఫైనల్ గా సైమా రీసెంట్ గా ఒక అవార్డ్ వేడుకల్లో ప్రశాంత్ వర్మ రెబలియస్ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు.

ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తే..

ఒక స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా ప్రశాంత్ వర్మ ని రెబలియస్ ప్రాజెక్ట్ గురించి అడిగితే.. నేను సిద్ధంగా ఉన్నా ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తే అప్పుడు సినిమా మొదలు పెట్టడమే అని అన్నాడు. రెబలియస్ ప్రాజెక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ ఏ సినిమా చేసినా దాన్ని నెక్స్ట్ లెవెల్ లో తీస్తాడన్న నమ్మకం వచ్చింది. అ! నుంచి జాంబి రెడ్డి, హనుమాన్ ఇలా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

ఐతే హనుమాన్ తర్వాత జై హనుమాన్, మహాకాళి ఇలా రెండు మూడు ప్రాజెక్ట్స్ ఒకేసారి అనౌన్స్ చేశాడు. అంతేకాదు నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమా డైరెక్షన్ ఛాన్స్ కూడా ప్రశాంత్ వర్మ అందుకున్నాడు. ఆ సినిమా అనౌన్స్ చేశాక ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఈ క్రమంలో ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్ అవుతుంది.. ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్నది చెప్పడం కష్టం.

ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2..

ప్రశాంత్ వర్మ తను కమిటైన సినిమాలు పూర్తి చేయాలి. మరోపక్క ప్రభాస్ కూడా ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఇలా కమిటైన సినిమాలన్నీ పూర్తి చేయాలి. అప్పుడే ప్రశాంత్ వర్మ సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రశాంత్ వర్మ తో ప్రభాస్ సినిమా కుదిరితే మాత్రం ప్రశాంత్ వర్మకు గొప్ప ఛాన్స్ వచ్చినట్టే లెక్క.

ప్రభాస్ కూడా యంగ్ టాలెంటెడ్ పీపుల్ తో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఐతే ప్రభాస్ సినిమాలు వరుసగా ఓకే చేస్తున్నాడు కానీ అవి ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడం కష్టమనిపించేలా ఉన్నాయి. ప్రభాస్ మాత్రం ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలా.. వారికి మంచి ట్రీట్ ఇచ్చేలా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. సందీప్ వంగ స్పిరిట్ త్వరలో మొదలు పెట్టబోతున్న ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడు చేస్తారన్నది చూడాలి. డైరెక్టర్ మాత్రం నేను రెడీ ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే షూటింగ్ అనేస్తున్నాడు.

Tags:    

Similar News