ప్రభాస్ ప్రాజెక్ట్‌లపై అది రూమరేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. రెండు మూడేళ్ల వరకు డేట్స్ ఖాలీలేని స్టేజ్‌లో ఉన్న ప్రభాస్ వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాడు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. రెండు మూడేళ్ల వరకు డేట్స్ ఖాలీలేని స్టేజ్‌లో ఉన్న ప్రభాస్ వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాడు. అయితే ప్రభాస్ అంగీకరించిన ప్రాజెక్ట్‌లలో కొన్నింటిని మాత్రమే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడని, కల్కి సీక్వెల్‌ని పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ప్రభాస్ మోకాళ్ల నొప్పి కారణంగా ప్రభాస్ తీవ్ర ఇబమ్బందుల్ని ఎదుర్కొంటున్నాడని ఆ కారణంగానే మిగతా ప్రాజెక్ట్‌లని పక్కన పెట్టాలనుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది.
కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ప్రభాస్ అంగీకరించిన ప్రాజెక్ట్‌లని పూర్తి చేయడానికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నాడని తెలుస్తోంది. సందీప్‌రెడ్డి వంగ `స్పిరిట్`, ప్రశాంత్ నీల్ `సలార్ శౌర్యాంగ పర్యం`, `ఫౌజీ` సినిమాల కారణంగా `కల్కి` సీక్వెల్‌ని పక్కన పెట్టాలనుకుంటున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని, అది ప్రచారం మాత్రమేనని ప్రభాస్ అంగీకరించిన ప్రాజెక్ట్‌లన్నింటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్.
అంతే కాకుండా ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా విషేస్ తెలియజేస్తూ ప్రభాస్ పెట్టిన పోస్ట్ తాజా రూమర్‌లకు చెక్ పెట్టింది. నాగ్ అశ్విన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే `కల్కి` సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, ఆ మ్యాజిక్ ని బహిర్గం చేయడానికి ఎదురుచూస్తున్నానని ప్రభాస్ చెప్పడంతో `కల్కి 2` రూమర్స్‌కు చెక్ పడింది.
ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌లలో `ది రాజా సాబ్` ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ వార్ డ్రామా `ఫౌజీ` వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మరో రెండు మూడు సినిమాలు వచ్చే ఏడాది సెట్స్‌పైకి రాబోతున్నాయి. 2026లో స్పిరిట్‌తో పాటు కల్కి 2, ప్రశాంత్ వర్మ సినిమాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.