'స్పిరిట్'లో ఐటమ్ బాంబ్
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్, యాక్షన్, వయొలెన్స్.. ఇవే గుర్తొస్తాయి.;
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్, యాక్షన్, వయొలెన్స్.. ఇవే గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో గ్లామర్ టచ్ కూడా గట్టిగానే ఉండబోతోందని తాజా సమాచారం. వంగా ప్లాన్ చేస్తున్న ఆ స్పెషల్ ఎలిమెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యాక్షన్ కు కాస్త విరామం ఇస్తూ, ఆడియన్స్ ను ఉర్రూతలూగించడానికి ఒక క్రేజీ ప్లాన్ వేశారు.
పాన్ ఇండియా సినిమా అన్నాక ఒక స్పెషల్ సాంగ్ ఉండటం ఈ మధ్య కామన్ అయిపోయింది. అదిరిపోయే బీట్స్, మాస్ స్టెప్పులు ఉంటేనే ఆడియన్స్ కు ఆ కిక్ వస్తుంది. ఇప్పుడు 'స్పిరిట్'లో కూడా అలాంటి ఒక మాస్ నంబర్ ను ప్లాన్ చేశారట. దీనికోసం టాలీవుడ్ భామలను కాకుండా, బాలీవుడ్ నుంచి ఒక టాలెంటెడ్ అండ్ గ్లామరస్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషిని సంప్రదించినట్లుతెలుస్తోంది. గ్లామర్ తో పాటు నటనలోనూ మంచి గుర్తింపు ఉన్న హుమా, ప్రభాస్ పక్కన చిందేస్తే ఆ జోష్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఆమె కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగం కావడానికి, ముఖ్యంగా ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సానుకూలంగా స్పందించిందని టాక్.
హుమా ఖురేషికి సౌత్ ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. గతంలో రజినీకాంత్ 'కాలా', అజిత్ 'వలిమై' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఒక పూర్తి స్థాయి మాస్ మసాలా సాంగ్ లో, అదీ ప్రభాస్ లాంటి కటౌట్ పక్కన ఆడిపాడటం అంటే ఆమె క్రేజ్ మరింత పెరగడం ఖాయం. సందీప్ వంగా మార్క్ టేకింగ్ లో ఈ పాట ఎంత వెరైటీగా, ఎంత బోల్డ్ గా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ ఇప్పటికే బల్క్ డేట్స్ ఇచ్చి ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి త్వరలోనే ఒక ప్రత్యేకమైన సెట్ వేయనున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే దీనికోసం ఒక క్యాచీ ట్యూన్ రెడీ చేశారని, అది థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయమని ఇన్ సైడ్ టాక్.
'స్పిరిట్'లో యాక్షన్ తో పాటు గ్లామర్ డోస్ కూడా దట్టించారని అర్థమవుతోంది. హుమా ఖురేషి ఎంట్రీ వార్త నిజమైతే, మాస్ ఆడియన్స్ కు పండగే. సీరియస్ పోలీస్ డ్రామాలో ఈ స్పెషల్ సాంగ్ ఏ సందర్భంలో వస్తుందో, వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై ఎలా పండుతుందో చూడాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.