• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జనవరి నుంచే అసలు లెక్క.....

జనవరి నుంచే అసలు లెక్క.. రెబల్ స్టార్ ఫిక్స్ చేశాడంతే..!

| జనవరి తర్వాత నుంచి ప్రభాస్ హను మూవీ షూట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ప్రభాస్ హను ఈ కాంబో సినిమాకు ఫౌజి అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

By - Tupaki Desk
Update: 2024-12-19 02:45 GMT

బాహుబలి కోసం ఐదేళ్లు అది కూడా రెండు సినిమాలకు అన్నేళ్లా అన్న ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి ఆ సినిమా ఫలితాలతో సమాధానం చెప్పాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగినట్టుగానే రిజల్ట్ లు అందుకుంటున్నాయి. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ 1 తో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఈ ఇయర్ కల్కితో మరో 1000 కోట్ల సినిమా అందించాడు.

కల్కి తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిన ప్రభాస్ నెక్స్ట్ నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా 80 శాతం పైగా పూర్తైంది. ఐతే ఆ సినిమాతో పాటు హను రాఘవపుడి తో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లింది. గత నెల నుంచి హను మూవీ షూటింగ్ జరుగుతుంది. ఐతే ప్రభాస్ మాత్రం ఆ సినిమా షూటింగ్ లో ఇంకా పాల్గొనలేదని తెలుస్తుంది.

జనవరి తర్వాత నుంచి ప్రభాస్ హను మూవీ షూట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ప్రభాస్ హను ఈ కాంబో సినిమాకు ఫౌజి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా జనవరి తర్వాత ఇంపార్టెంట్ సీన్స్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రభాస్ లేని సీన్స్ ఇంకా మిగతా సీన్స్ ని షూట్ చేస్తున్నారు హను రాఘవపుడి.

ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ సందీప్ వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. 2025 లో ప్రభాస్ రాజా సాన్, ఫౌజి, స్పిరిట్ 3 సినిమాలకు డేట్స్ ఇవ్వబోతున్నాడు. ఫౌజి సినిమా 2026 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న హను రాఘవపుడి ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇవే కాకుండా కల్కి 2 సినిమాకు కూడా నెక్స్ట్ ఇయర్ డేట్స్ అడ్జెస్ట్ చేయాల్సి ఉంది. ఇక మీద ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. మరి అందుకు తగినట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది.

Tags:    
  • Prabhas 
  • Hanuraghavapudi 
  • Fauji 
  • Movieshooting 
  • Sandeepreddyvanga 
  • Spirit 
  • TheRajasaab 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS