జిమ్ మాత్రమే కాదు… ప్రభాస్ ఫిట్‌నెస్‌లో అది కూడా భాగమేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఆసక్తిని కలిగించే అంశాల్లో ఆయన ఫిట్‌నెస్ ఒకటి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఆసక్తిని కలిగించే అంశాల్లో ఆయన ఫిట్‌నెస్ ఒకటి. భారీ యాక్షన్ సినిమాలు, కఠినమైన షూటింగ్ షెడ్యూళ్లు, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్లు వంటి వాటి మధ్య ప్రభాస్ తన ఫిట్‌నెస్‌ను ఎలా మెయింటైన్ చేస్తారనే డిస్కషన్ తరచూ జరుగుతూనే ఉంటుంది. తాజాగా నటుడు రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ ఈ డిస్కషన్ కు మరో ఇంట్రెస్ట్రింగ్ యాంగిల్ ను జోడించాయి.
ఫౌజీ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్ రవీంద్రన్, ప్రభాస్‌కు వాలీబాల్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. అంతేకాదు, ఆయన ఫార్మ్‌హౌస్‌లో వాలీబాల్ కోర్ట్ కూడా ఉందని, వీలున్నప్పుడల్లా వాలీబాల్ ఆడటం ప్రభాస్‌కు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఫౌజీ షూటింగ్ టైమ్ లో ఈ విషయంపై ప్రభాస్‌తో ప్రత్యేకంగా మాట్లాడాలని కూడా తాను భావిస్తున్నట్లు రాహుల్ వెల్లడించారు.
ఈ కామెంట్స్ తో ప్రభాస్ ఫిట్‌నెస్‌పై కొత్త డిస్కషన్ మొదలైంది. సాధారణంగా స్టార్ హీరోల ఫిట్‌నెస్ అంటే జిమ్ వర్కౌట్స్, వెయిట్ ట్రైనింగ్, డైట్ ప్లాన్స్ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. కానీ వాలీబాల్ వంటి స్పోర్ట్ కూడా ఫిట్‌నెస్‌లో కీలక పాత్ర పోషించగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాలీబాల్ ఆడటం వల్ల కార్డియో ఫిట్‌నెస్ మెరుగుపడటంతో పాటు స్టామినా, రిఫ్లెక్స్, అజిలిటీ, కోఆర్డినేషన్ వంటి ఫిజికల్ స్టామినా కూడా పెరుగుతాయి.
ప్రభాస్ ఫార్మ్‌హౌస్‌లో వాలీబాల్ కోర్ట్ ఉండటం ఆయనకు ఈ ఆటపై ఉన్న వ్యక్తిగత అభిరుచిని సూచించే అంశంగా ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. షూటింగ్‌ల మధ్య దొరికే గ్యాప్ లో జిమ్‌కే పరిమితం కాకుండా స్పోర్ట్స్ ద్వారా కూడా రిలాక్స్ అవుతూ ఫిట్‌గా ఉండటాన్ని ఆయన ఇష్టపడతారని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరలవుతున్నాయి. ప్రభాస్ గురించి రెగ్యులర్ గా బయటకు రాని వ్యక్తిగత అభిరుచులకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఫిట్‌నెస్ అంటే కేవలం జిమ్ మాత్రమే కాదు, మనకు ఇష్టమైన క్రీడ కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగమవుతుందనే మెసేజ్‌ను ఈ డిస్కషన్ మరోసారి గుర్తు చేస్తోంది.