ఆర్టిస్ట్‌లకు ముప్పై కేజీల బరువైన గొలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. `ది రాజా సాబ్` తరువాత ప్రభాస్ తన దృష్టిని క్రేజీ పాన్ ఇండియా మూవీస్ కల్కి 2, స్పిరిట్, ఫౌజీలపై పెట్టారు. ఒక సినిమా పూర్తయితే మరో సినిమాకు మాత్రమే అందుబాటులో ఉండే ప్రభాస్ ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఏక కాలంలో మూడు భారీ ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి.
ముందుగా హను రాఘవపూడి `ఫౌజీ`ని స్టార్ట్ చేయడం తెలిసిందే. 1940ల నాటి బ్రిటీష్ ఇండియా కాలం నేపథ్యంలో సాగే ఓ సోల్జర్ స్టోరీగా దీన్ని దర్శకుడు హను రాఘవపూడి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్ ఇమాన్ ఇస్మాయిల్‌ని ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌కి షార్ట్ బ్రేక్ లభించడంతో హీరో ప్రభాస్ వేసవి వెకేషన్ కోసం ఇటలీకి వెళ్లిపోయారు.
తిరిగి రాగానే మిగతా షూటింగ్‌ని పూర్తి చేసి సినిమాని ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో నటించిన `బలగం` ఫేమ్ మైమ్ మధు ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఓ మీడియా పోడ్ కాస్ట్‌లో మైమ్ మధు `ఫౌజీ` సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `ఫౌజీ` షూటింగ్‌లో ఆర్టిస్ట్‌లకు ముప్పై కేజీల గొలుసులేసి షూటింగ్ చేస్తున్నారని వెల్లడించి షాక్ ఇచ్చాడు.
నేను `ఫౌజీ` సినిమాలో నటిస్తున్నాను. ఇది చరిత్ర సృష్టిస్తుందని నమ్మకముంది. ఈ సినిమాలో పని చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉంది. సెట్స్‌లోకి అడుగుపెడుతుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇటీవల సెట్‌లో ప్రభాస్‌గారిని చూశాను. డీఓపీ, దర్శకుడు హను రాఘవపూడిగారి విజన్ మనల్ని ఓ విభిన్న ప్రపంచానికి తీసుకెళుతుంది. ఇదొక చారిత్రాత్మక చిత్రం. ఇదొక చరిత్ర సృష్టిస్తుంది. డైరెక్టర్‌గారు మా అందరికి ముప్పై కేజీల గొలుసులు వేసి యాక్ట్ చేయిస్తున్నారు.
దర్శకుడు హను గారితో కలిసి వర్క్ చేయడం చాలా అద్భుతంగా ఉంది` అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో ప్రభాస్ సోల్జర్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇతర కీలక పాత్రల కోసం లెజెండరీ యాక్టర్స్‌ని రంగంలోకి దించేశారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, సీనియర్ నటుడు భాను చందర్, రాహుల్ రవీంద్రన్, ప్రవీణ్ దాచారం, చైత్ర జె. ఆచర్ నటిస్తున్నారు.