దర్శకుడు మారుతి అడ్రస్‌కు పార్సెల్స్ పంపించిన ప్రభాస్ అభిమానులు.. ఇంత వైల్డ్‌గా ఉన్నారేంటి!

టాలీవుడ్‌లో ప్రభాస్ అభిమానుల రూట్ వేరు అనే విషయం మరోసారి రుజువయింది.;

Update: 2025-12-31 05:16 GMT

టాలీవుడ్‌లో ప్రభాస్ అభిమానుల రూట్ వేరు అనే విషయం మరోసారి రుజువయింది. ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ది రాజా సాబ్ ..ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు మారుతి చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పటివరకు తాను చేసిన సినిమాలు చిన్న, మధ్య స్థాయి చిత్రాలేనని, అలాంటి తనకు ప్రభాస్ లాంటి స్టార్ హీరో అవకాశం ఇవ్వడం తన జీవితంలో చాలా పెద్ద విషయమని చెప్పారు…సినిమా గురించి పూర్తి నమ్మకంతో మాట్లాడిన మారుతి, “ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచదు” అని ధైర్యంగా చెప్పారు. అంతేకాదు..సినిమా నచ్చకపోతే తన ఇంటికి వచ్చి అడగొచ్చని చెప్పుతూ స్టేజ్‌పైనే తన ఇంటి అడ్రస్ కూడా చెప్పారు. సాధారణంగా దర్శకులు ఇలా మాట్లాడటం చాలా అరుదు. అందుకే ఈ మాటలు వెంటనే వైరల్ అయ్యాయి.

మారుతి చెప్పిన ఈ మాటలను ప్రభాస్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు. అయితే విమర్శలు చేయకుండా ప్రేమ చూపించాలనే ఉద్దేశంతో, ‘రాజాసాబ్’ ట్రైలర్ చూసి బాగా ఇంప్రెస్ అయిన అభిమానులు.. మారుతి ఇంటికి ఏకంగా బిర్యానీ పార్సెల్స్ పంపించారు. ఈ అనూహ్యమైన చర్య దర్శకుడిని చాలా సంతోషపరిచింది.

బిర్యానీ ప్యాకెట్ల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మారుతి, ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. డార్లింగ్స్ మీ గిఫ్ట్ సూపర్..అలాగే జనవరి 9న తనవైపు నుంచి “రివర్స్ ట్రీట్” ఇస్తానని సరదాగా కామెంట్ చేశారు. ఈ విషయంలో ‘రాజాసాబ్’ సినిమా సోషల్ మీడియా టీమ్ కూడా స్పందించింది. “అడ్రస్ ఎందుకు ఇచ్చారు… అభిమానులు దాన్ని ఎందుకు వాడారు.. ఇంత వైలెంట్ గా ఉన్నారేంటిరా మీరు” అంటూ ఫన్నీగా కామెంట్ చేయడంతో ఈ విషయం మరింత వైరల్ అయింది.

Tags:    

Similar News