రెబల్ స్టార్ కూడా స్టెప్పులు వేస్తే..?
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏది ఇష్టమో అది అందిస్తాడు. లవ్ స్టోరీ, యాక్షన్, పీరియాడికల్, క్లాస్, మాస్ ఇలా అన్నిటినీ కవర్ చేస్తాడు.;
స్టార్ హీరోలు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు డైలాగ్స్ అదరగొడితే.. కొందరు ఫైట్స్ అదరగొడతారు.. మరికొందరు డ్యాన్స్ బాగా చేస్తారు. ఇలా ప్రతి ఒక హీరో తాను బలంగా ఉన్న వాటిల్లో ది బెస్ట్ ఇచ్చేస్తాడు. ఐతే ఫ్యాన్స్ మాత్రం మా హీరో ఇది కూడా చేస్తే చూడాలని ఉందని ఆశపడతారు. స్టార్ హీరోలంతా ఫ్యాన్స్ కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. అందుకే వాళ్లకు సూట్ కాకపోయినా.. అంతకుముందు పెద్దగా ట్రై చేయకపోయినా జస్ట్ ఫ్యాన్స్ కోసం చేస్తారు. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ సెటప్ జరగబోతుంది.
ప్రభాస్ విషయంలో ఒకే ఒక్క కంప్లైంట్..
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏది ఇష్టమో అది అందిస్తాడు. లవ్ స్టోరీ, యాక్షన్, పీరియాడికల్, క్లాస్, మాస్ ఇలా అన్నిటినీ కవర్ చేస్తాడు. ఐతే ప్రభాస్ విషయంలో ఒకే ఒక్క కంప్లైంట్ డ్యాన్స్ సరిగా చేయడు అని. రాదని కాదు ఎందుకులే అనుకుంటాడు. మొన్నటిదాకా సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా ఇలానే డ్యాన్స్ ల విషయంలో ట్రోల్ చేశారు. బ్రహ్మోత్సవం సాంగ్ గురించి చాలా పెద్ద డిస్కషనే జరిగింది.
అందుకే దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని మహేష్ కష్టపడి ఒక సాంగ్ కి మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అలా సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ నుంచి గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి దాకా వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ మాస్ డ్యాన్స్ బాబోయ్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయింది. ఐతే అలానే నెక్స్ట్ లైన్ లో ప్రభాస్ ఉన్నాడని టాక్. ఫ్యాన్స్ తన నుంచి డ్యాన్స్ కూడ్డా ఆశిస్తున్నారన్న విషయం తెలిసింది.
రాజా సాబ్ సినిమాలో సరికొత్త ప్రభాస్..
అందుకే రాజా సాబ్ లో ప్రభాస్ డ్యాన్స్ లో కూడా కుమ్మేస్తాడట. రాజా సాబ్ సినిమాలో సరికొత్త ప్రభాస్ ని చూస్తారని టాక్. క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు ప్రభాస్ స్టైల్, డైలాగ్ డిక్షన్ అంతా కొత్తగా ఉంటుందట. మొత్తానికి ప్రభాస్ తో మారుతి డ్యాన్స్ చేయిస్తున్నాడన్నమాట. అదే నిజమైతే మాత్రం రెబల్ ఫ్యాన్స్ కి అంతకుమించిన పండగ మరొకటి ఉండదని చెప్పొచ్చు.
ప్రభాస్ రాజా సాబ్ 2026 జనవరి 9న రిలీజ్ లాక్ చేశారు. ఆ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న ఫౌజీ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.
ఇవే కాదు ప్రభాస్ నెక్స్ట్ సందీప్ వంగతో స్పిరిట్ చేయాల్సి ఉంది. ఆ సినిమా మొత్తం 3, 4 నెలల్లో పూర్తి చేసేలా సందీప్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఇక కల్కి 2, సలార్ 2 సినిమాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఫైనల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కి వరుస భారీ సినిమాలు ఫుల్ ట్రీట్ కాదు అంతకుమించి అనిపించేలా ఉన్నాయి.