పొంగల్ ఫైట్.. ఆ ముగ్గురు మధ్య 21 ఏళ్ల తర్వాత..!
ముఖ్యంగా సంక్రాంతి, దసరా లాంటి పండగలకు స్టార్ సినిమాలు రావాలి బాక్సాఫీస్ కళకళలాడాలని ఆడియన్స్ కోరుతారు.;
స్టార్ సినిమా అంటే చాలు ఏ పండగకి వస్తుందని అనిపించేలా రిలీజ్ లు ఉంటున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి, దసరా లాంటి పండగలకు స్టార్ సినిమాలు రావాలి బాక్సాఫీస్ కళకళలాడాలని ఆడియన్స్ కోరుతారు. అభిమాన హీరో సినిమా పండగ రోజు రిలీజైతే చూస్తే వచ్చే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఐతే అన్ని పండగలకు ఏమో కానీ సంక్రాంతి అంటే మాత్రం సినిమాల పండగ అన్నట్టు ఉంటుంది. పొంగల్ ఫైట్ కి స్టార్స్ సైతం రెడీ అనేస్తారు. ఎప్పటిలానే వచ్చే సంక్రాంతికి స్టర్ సినిమాలు ఢీ కొట్టబోతున్నాయి.
మన శంకర వరప్రసాద్ గారు ఖర్చీఫ్ వేశారు..
ఐతే ఈసారి రేసులో మన శంకర వరప్రసాద్ గారు.. అదే మన మెగాస్టార్ చిరంజీవి ముందే ఖర్చీఫ్ వేశారు. ఈ ఇయర్ కూడా విశ్వంభర ముందు సంక్రాంతికే అనుకున్నారు కానీ అది కాస్త నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది. అందుకే సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ చేశారు. సంక్రాంతి హీరోగా స్టార్స్ తమ సినిమాలతో వస్తుంటే.. సంక్రాంతి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు.
2026 పొంగల్ కి ప్రభాస్ రాజా సాబ్ వస్తుంది. అసలైతే ఆ సినిమా ఈ డిసెంబర్ కి రావాల్సింది కానీ అభిమానుల కోరిక మేరకు పొంగల్ కి షిఫ్ట్ చేశారు. సో ఇప్పటివరకు అయితే ప్రభాస్ వర్సెస్ చిరంజీవి పోటీ ఫిక్స్ అని తెలుస్తుంది. ఐతే బాలకృష్ణ అఖండ 2 కూడా వచ్చే సంక్రాంతికి వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. అసలైతే అఖండ 2 ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల కుదరట్లేదు.
సెంటిమెంట్ తో అఖండ 2..
ఐతే రాజా సాబ్ వదిలిన డిసెంబర్ స్లాట్ ఉంది. ఐతే బాలయ్య సినిమాలు సంక్రాంతికి వస్తే అవి తప్పకుండా మంచి ఫలితాన్ని అందుకుంటాయి. ఆ సెంటిమెంట్ తో అఖండ 2 ని సంక్రాంతికి తెచ్చే ప్లాన్ ఉందట.
ఐతే ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ ఈ ముగ్గురు సంక్రాంతికి ఒకసారి పోటీ పడ్డారు. 2004 సంక్రాంతికి బాలయ్య లక్ష్మి నరసింహా, ప్రభాస్ వర్షం సినిమాతో పాటు చిరంజీవి అంజి రిలీజ్ అయ్యాయి. ఐతే వాటిలో అంజి ఫ్లాప్ అవ్వగా వర్షం బ్లాక్ బస్టర్ అయ్యింది. బాలయ్య లక్ష్మి నరసింహా కూడా సక్సెస్ అందుకుంది.
ఒకవేళ బాలయ్య కూడా అఖండ 2 తో సంక్రాంతి రిలీజ్ అంటే ఆఫ్టర్ 21 ఇయర్స్ మళ్లీ చిరు, ప్రభాస్, బాలయ్య సినిమాల ఫైట్ చూడబోతున్నాం. మరి అప్పుడు రిజల్ట్ అలా ఉంటే.. ఇన్నేళ్ల తర్వాత ఈ ముగ్గురు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.