సందీప్‌రెడ్డి వంగ బ‌ర్త్‌డే..ప్ర‌భాస్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌!

అర్జున్‌రెడ్డి, క‌బీర్‌సింగ్‌, యానిమ‌ల్ మూవీస్‌తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ‌.;

Update: 2025-12-25 06:23 GMT

అర్జున్‌రెడ్డి, క‌బీర్‌సింగ్‌, యానిమ‌ల్ మూవీస్‌తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ‌. రెగ్యుల‌ర్ సినిమా ఫార్ములాని బ్రేక్ చేస్తూ సందీప్ చేసిన సినిమాలు ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డ‌మే కాకుండా సినిమా మేకింగ్‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాయి. చేసింది కేవ‌లం రెండు సినిమాలే అయినా త‌న‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ప్ర‌తీ హీరో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా భారీ క్రేజ్‌ని, అంతే స్థాయి డిమాండ్‌ని సొంతం చేసుకున్న సందీప్‌రెడ్డి వంగ పుట్టిన రోజు నేడు.

ఈ సంద‌ర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా పెట్టిన పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారి ట్రెండ్ అవుతోంది. క్రేజీ డైరెక్ట‌ర్ సందీప్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియజేస్తూనే `స్పిరిట్` ప్రాజెక్ట్ రిలీజ్ కోసం స‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని ప్ర‌భాస్ పోస్ట్ పెట్టాడు. `పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు బ్రో.. నువ్వు సృష్టిస్తున్న దానిని అంద‌రూ చూడ‌టం కోసం వేచి వుండ‌లేక‌పోతున్నాను` అంటూ ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడో స్పష్టం చేసి సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాడు.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా సందీప్‌రెడ్డి వంగ చేస్తున్న భారీ రొమాంటిక్ యాక్ష‌న్ కాప్‌ డ్రామా `స్పిరిట్‌`. యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, ప్ర‌కాష్‌రాజ్‌, కాంచ‌న‌, వివేక్ ఓబెరాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించారు. జ‌న‌వ‌రి వ‌ర‌కు కంటిన్యూగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. హాట్ కంటెంట్ కూడా `యానిమ‌ల్‌`కి మించి ఉంటుందని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే త్రిప్తి దిమ్రీని సందీప్ హీరోయిన్‌గా తీసుకున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.

రీసెంట్‌గా విడుద‌ల చేసిన `స్పిరిట్` డైలాగ్ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. సినిమా ప్ర‌ధానంగా జాతీయ భ‌ద్ర‌తా స‌మ‌స్య చుట్టూ తిగిగే క‌థ‌గా సాగుతుంద‌ని, దేశ భ‌ద్ర‌త‌కు పొంచి ఉన్న భారీ ప్ర‌మాదాన్ని ఎదుర్కొనే నిజాయితీ గ‌ల పోలీస్ అధికారిగా ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఇండియా భ‌ద్ర‌తే ధ్యేయంగా ప‌ని చేసే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ఇందులో ప్ర‌భాస్ క‌నిపిస్తాడ‌ని, ప్ర‌భాస్‌పై ప్లాన్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు గూస్‌బంప్స్ తెప్పిస్తాయ‌ని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    

Similar News