శత్రువు లేని పాన్ ఇండియా డార్లింగ్

ఒక హీరో పుట్టినరోజు కేవలం ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా, మొత్తం ఇండస్ట్రీకి ఒక ఈవెంట్‌గా మారడం అరుదు.;

Update: 2025-10-22 12:43 GMT

ఒక హీరో పుట్టినరోజు కేవలం ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా, మొత్తం ఇండస్ట్రీకి ఒక ఈవెంట్‌గా మారడం అరుదు. రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. అక్టోబర్ 23న ఆయన పుట్టినరోజు వస్తుందంటే, ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలవుతుంది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా అలాంటి వైబ్స్ కనిపిస్తాయి. ఇక చివరికి ఓవర్సీస్‌లోనూ ఈ బర్త్‌డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది డార్లింగ్ సంపాదించుకున్న పాన్ ఇండియా, పాన్ వరల్డ్ క్రేజ్‌కు నిదర్శమని చెప్పవచ్చు.

​ఒకప్పుడు టాలీవుడ్ స్టార్‌గా ఉన్న ప్రభాస్, 'బాహుబలి'తో తన రేంజ్‌ను పూర్తిగా మార్చేశాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన అతి కొద్ది మంది హీరోలలో ఆయన ఒకరు. ప్రభాస్ సినిమా వస్తుందంటే, అది ఏ భాషలో అయినా, ఏ దేశంలో అయినా భారీ ఓపెనింగ్స్‌ను రాబడుతుంది. యూఎస్, యూకే, జపాన్.. ఇలా ప్రతీ చోటా ప్రభాస్ సినిమాలకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.

అందుకే, డార్లింగ్ చేసే ప్రతీ సినిమా ఇప్పుడు సహజంగానే ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా మారిపోతోంది. ఈ నెల 31న రాబోతున్న 'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్‌పై ఉన్న అంచనాలే దీనికి నిదర్శనం. ​ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే, తన ఇమేజ్‌ను ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ప్లాన్ చేసుకుంటున్నాడో అర్థమవుతుంది. ఒకవైపు 'సలార్ 2', 'కల్కి 2', సందీప్ వంగాతో 'స్పిరిట్', హను రాఘవపూడితో స్పై యాక్షన్ థ్రిల్లర్ వంటి భారీ యాక్షన్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' లాంటి రొమాంటిక్ హారర్ కామెడీతో వస్తున్నాడు.

చాలా కాలంగా ఫ్యాన్స్ మిస్ అవుతున్న వింటేజ్, లవర్ బాయ్ ప్రభాస్‌ను ఈ సినిమాలో చూడబోతున్నామని తెలుస్తోంది. అందుకే ఆ, ప్రాజెక్ట్‌పై పవర్ఫుల్ హైప్‌ను క్రియేట్ చేసింది. ​కేవలం లీడ్ రోల్స్ మాత్రమే కాదు, చిన్న పాత్రల్లో కనిపించినా ప్రభాస్ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన 'కన్నప్ప' సినిమాలో పోషించిన రుద్ర పాత్ర నిడివి తక్కువే అయినా, సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇది ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు, పెర్ఫార్మెన్స్‌కు ఉన్న పవర్‌ను తెలియజేస్తుంది. అందుకే, లైనప్‌లోని ప్రతీ సినిమాపై అంచనాలు స్కై రేంజ్‌లో ఉంటున్నాయి.

​అయితే, ప్రభాస్‌ను కేవలం బాక్సాఫీస్ నంబర్లతోనే కొలవలేం. తెరపై ఎంత పెద్ద స్టార్ అయినా, నిజ జీవితంలో సింప్లిసిటీ, ఫ్రెండ్షిప్, సహాయం చేసే గణం ప్రభాస్ ని అందరివాడిని చేశాయి. ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎవరు కూడా ఆయనపై అనవసర కాంట్రవర్సీలు క్రియేట్ చేయరు. శత్రువులు అసలే లేరు. నచ్చితే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడాని మంచి గుర్తింపు ఉంది. ఈ విషయం గురించి అందరికి తెలిసిందే. అందరినీ ఆప్యాయంగా పలకరించే మనిషిగా ఆయనకు మంచి పేరుంది. అందుకే, అభిమానులు ప్రేమగా "డార్లింగ్" అని పిలుచుకుంటారు. ఈ స్టార్‌డమ్, పర్సనాలిటీ కలయికే ప్రభాస్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ​తెలుగు సినిమాను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెడుతూ, అదే సమయంలో తన 'డార్లింగ్' ఇమేజ్‌ను కాపాడుకుంటున్న ప్రభాస్, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News