ప్రభాస్-అనుష్క లను మళ్లీ కలిపేదెవరు?
అనుష్క తనని తాను ఎంత సమర్దించుకున్నా? ఈ విషయంలో కొంత ప్రతికూల సన్నివేశాన్నే ఎదు ర్కుంది. ఈ ఫేజ్ నుంచి అనుష్క బయట పడాలంటే డార్లింగ్ కూడా అంతే సహకరించాలి.;
ప్రభాస్ -అనుష్క కాంబినేషన్ ఎంత అందంగా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. `మిర్చి` , `బిల్లా` లాంటి రీజనల్ మార్కెట్ చిత్రాల్లో అలరించారు. అటుపై `బాహుబలి` రెండు భాగాలతో పాన్ ఇండియానే షేక్ చేసారు. కానీ అనంతరం మళ్లీ ఆ జోడీ తెరపై కనిపించలేదు. అనుష్క సినిమాలు తగ్గించడం..ప్రభా స్ వేర్వేరు హీరోయిన్లతో పని చేయడం జరిగింది. దీంతో ఆ కాంబినేషన్ లో మరో సినిమా పడితే బాగుండని అభిమానులు సైతం ఆశీస్తున్నారు. వెండి తెరపై ఆ సూపర్ జోడీని చూసుకోవాలని మురిసిపోతున్నారు.
మరి మళ్లీ ఆ కాంబినేషన్ సాధ్యమవుతుందా? అంటే అది పూర్తిగా దర్శక, హీరో చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియాలో పెద్ద స్టార్. ఇప్పుడతని పక్కన తీసుకునే ఏ నటి అయినా ఆ రేంజ్ హీరోయిన్ అయి ఉండాలి. కానీ అనుష్క బాహుబలి తర్వాత మాత్రం మరో పాన్ ఇండియా సినిమా చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఉన్న మార్కెట్ కూడా డౌన్ అయింది. సినిమాలకు దూరంగా ఉండటం..సోషల్ మీడియా లో యాక్టివ్ గా లేకపోవడం వంటి సన్నివేశాలు అమ్మడి కెరీర్ పై కొంత ప్రభావాన్ని చూపించాయి అన్నది కాదనలేని వాస్తవం.
అనుష్క తనని తాను ఎంత సమర్దించుకున్నా? ఈ విషయంలో కొంత ప్రతికూల సన్నివేశాన్నే ఎదు ర్కుంది. ఈ ఫేజ్ నుంచి అనుష్క బయట పడాలంటే డార్లింగ్ కూడా అంతే సహకరించాలి. తనకు జోడీగా అనుష్క ను రికమండ్ చేయగలగాలి. దర్శకులు కూడా స్వీటిని దృష్టిలో పెట్టుకోగలగాలి. ఇటీవలే అను ష్క నటించిన లేడీ ఓరియేంటెడ్ చిత్రం `ఘాటీ` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అమ్మ డు చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో అనుష్క కు లిప్ట్ కూడా అవసరమైన సమయమిది.
ఇప్పుడున్న సన్నివేశంలో బౌన్స్ బ్యాక్ అవ్వడం అంత వీజీ కాదు. హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. కన్నడ నుంచి వస్తోన్న కొత్త భామలకు ప్రాధన్యత పెరిగింది. ఈ క్రమంలో అనుష్కకకు ఇది కాస్త ఊరట నిచ్చే అంశమే. స్వీటీ కూడా కన్నడిగి అన్న సంగతి తెలిసిందే. మరి ఆ రకమైనా భాషాభిమానం ప్రశాంత్ నీల్ , రిషబ్ శెట్టి లాంటి వారు చూపించ గల్గితే? అనుష్కకు మరో పాన్ ఇండియా చిత్రంలో ఛాన్స్ పెద్ద విషయం కాదు.