• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లిపై ప్రభాస్ కన్...

పెళ్లిపై ప్రభాస్ కన్ ఫ్యూజన్ తీరలేదా..?

| రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ డం తెచ్చుకుని వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-11-11 13:30 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ డం తెచ్చుకుని వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. బాహుబలి ముందు వరకు కేవలం తెలుగు హీరో సౌత్ హీరో మాత్రమే అనుకునే ప్రభాస్ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రభాస్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏంటన్నది సినిమా రిలీజ్ టైం లో హంగామా చూస్తే అర్ధమవుతుంది. ఐతే ఇంత పెద్ద హీరో అయిన ప్రభాస్ స్టిల్ బ్యాచిలర్ గా ఉండటం విశేషం. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పెళ్లి మాట ఎత్తితే చాలు ఆమడదూరం వెళ్తాడు.

కృష్ణంరాజు గారు ఉన్నప్పుడే ప్రభాస్ పెళ్లి జరగాల్సింది కానీ కుదరలేదు. ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ఆసక్తిగా ఉన్నారు. ఐతే ప్రభాస్ కి అసలు పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా అన్నది క్లారిటీ రావట్లేదు. ఐతే పెళ్లిపై ప్రభాస్ ఒక నిర్ణయానికి వచ్చాడని త్వరలోనే అతను పెళ్లి చేసుకుంటాడని కొందరు అంటున్నారు. తీరా ప్రభాస్ విషయానికి వస్తే పెళ్లి చేసుకోవాలా వద్దా అని మళ్లీ మొదటికే వచ్చేశాడు.

రీసెంట్ గా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జ్ఞాపకార్ధంగా నా ఉచ్చ్వాసం కవనం షోలో ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. శాస్త్రిగారితో ప్రభాస్ కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శాస్త్రి గారు రాసిన పాటల్లో తనకు ఇష్టమైన పాటల గురించి ప్రోగ్రాం లో చెప్పాడు ప్రభాస్. ముఖ్యంగా పెళ్లిపై శాస్త్రి గారు చాలా పాటలు రాశారని.. మనీ సినిమాలో భద్రం బీకేర్ ఫుల్ భ్రదర్ అని రాశారు. ఇలాంటి టైం లోనే అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అని నవ్వేశారు ప్రభాస్.

అంటే దీన్ని బట్టి ప్రభాస్ ఇంకా పెళ్లి విషయంపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేడన్నది అర్ధమవుతుంది. ప్రభాస్ పెళ్లి పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కాబోయే భార్య ఈమే అంటూ మీడియా ఎప్పుడూ హడావిడి చేస్తూనే ఉంటుంది. మరోపక్క ప్రభాస్ అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న దగ్గరే ఉన్నాడు. ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి తన పర్సనల్ లైఫ్ కేమో కానీ పెళ్లి గురించి ఎగ్జైట్ గా ఉన్న వారికి మాత్రం ఒక పరిష్కారం దొరికినట్టు అవుతుంది.

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాతో పాటు కల్కి 2, స్పిరిట్, సలార్ 2 సినిమాలను కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు. హను రాఘవపుడి డైరెక్షన్ లో ఫౌజి అనే సినిమా కూడా ప్రభాస్ సినిమాల లైన్ లో ఉంది.

Tags:    
  • Prabhas 
  • Sirivennelasastry 
  • Prabhasmarriage 
  • Etvshow 
  • Nauchhwasamkavanam 
  • Tollywoodhero 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS