డబ్బున్న హీరోయిన్స్.. భర్తల కంటే వీళ్లకే ఎక్కువ ఆస్తి!
అలాగే, ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా కూడా తెలివైన వ్యాపారవేత్త. ఆమె ఆస్తి విలువ రూ. 183 కోట్లు కాగా, భర్త జీన్ గుడ్‌ఎనఫ్ ఆస్తి రూ. 25 కోట్లు మాత్రమే.;
"ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది" అనే మాట పాతబడిపోయింది. ఇప్పుడు "విజయం సాధించిన హీరోల పక్కన, వాళ్లకంటే పవర్ ఫుల్ హీరోయిన్లు ఉన్నారు" అని చెప్పుకోవాలేమో. గ్లామర్ ప్రపంచంలో ఈ లేడీ బాస్‌లు రూల్స్ తిరగరాస్తున్నారు. నటనలో, అందంలోనే కాదు.. ఆస్తులు సంపాదించడంలోనూ తమ భర్తలను మించిపోయి, ఆర్థికంగా తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు.
కేవలం నటనపైనే ఆధారపడకుండా, స్మార్ట్ బిజినెస్ ఉమెన్‌గా మారి వందల కోట్లకు అధిపతులయ్యారు. ఈ లిస్ట్‌లో టాప్ లో ఉండే హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్. తన 51 ఏళ్ల వయసులోనూ ఆమె బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. దాదాపు రూ. 900 కోట్ల ఆస్తితో, తన భర్త అభిషేక్ బచ్చన్ (రూ. 280 కోట్లు) కంటే మూడు రెట్లు ముందున్నారు. దశాబ్దాలుగా అంతర్జాతీయ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉండటమే ఆమె ఆర్థిక శక్తికి నిదర్శనం.
అలాగే, ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా కూడా తెలివైన వ్యాపారవేత్త. ఆమె ఆస్తి విలువ రూ. 183 కోట్లు కాగా, భర్త జీన్ గుడ్‌ఎనఫ్ ఆస్తి రూ. 25 కోట్లు మాత్రమే. ఐపీఎల్ టీమ్ ఓనర్‌షిప్‌తో ప్రీతి తన సంపాదనను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుత బాలీవుడ్ ని ఏలుతున్న క్వీన్స్ దీపికా పదుకొణె, అలియా భట్ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
దీపికా తన భర్త రణ్‌వీర్ సింగ్ (రూ. 245 కోట్లు) కంటే డబుల్ ఆస్తితో (రూ. 500 కోట్లు) ముందుంది. సొంత ప్రొడక్షన్ హౌస్, స్కిన్ కేర్ బ్రాండ్‌తో బిజినెస్‌లోనూ దూసుకుపోతోంది. యంగ్ సెన్సేషన్ అలియా భట్ ఆస్తి విలువ రూ. 550 కోట్లు కాగా, భర్త రణబీర్ కపూర్ ఆస్తి రూ. 345 కోట్లు. సొంతంగా కిడ్స్ వేర్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతూ చిన్న వయసులోనే పెద్ద వ్యాపారవేత్తగా మారింది.
ఈ ట్రెండ్ కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. సౌత్ ఇండియాలో కూడా కొనసాగుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఆస్తి విలువ రూ. 200 కోట్లు కాగా, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆస్తి రూ. 50 కోట్లు. ఇక, కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ (రూ. 41 కోట్లు) కంటే ఐదు రెట్లు ఎక్కువ ఆస్తితో (రూ. 224 కోట్లు) అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే తన సొంత బ్యూటీ బ్రాండ్‌తో కత్రినా భారీగా సంపాదిస్తోంది. ఈ తారలు కేవలం భార్యలుగానే కాకుండా, తమకంటూ సొంత ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మించుకుని, ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.