ఇండియా- పాక్ మ్యాచ వేళ ముంబయి వీధుల్లో పూనమ్
బాలీవుడ్ నటి పూనమ్ పాండే తాజాగా మరోసారి తన చర్యలతో వార్తల్లో నిలిచారు. 2025 ఆసియా కప్ భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు ముంబయి వీధుల్లో పూనమ్ పాండే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.;
బాలీవుడ్ నటి పూనమ్ పాండే తాజాగా మరోసారి తన చర్యలతో వార్తల్లో నిలిచారు. 2025 ఆసియా కప్ భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు ముంబయి వీధుల్లో పూనమ్ పాండే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. టీమ్ఇండియా అభిమానులంతా మైదానంలోని ఆటగాళ్లపై దృష్టి పెట్టగా.. పూనమ్ మాత్రం తనదైన స్టైల్ తో మైండ్ బ్లాక్ చేశారు. దేశం పట్ల తన స్టైల్ లో భక్తిని చాటుకున్నారు. ఆమె చర్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ కు ముందు.. పూనమ్ ముంబయి వీధుల్లో ఆకట్టుకునే రీతిలో ప్లకార్డులతో కనిపించారు. ప్లకార్డులపై ఆమె రాసిన కొటేషన్ లు సంచలనంగా ఉన్నాయి. అందులో మొదటి ప్లకార్డ్ పై.. నేను పూనమ్ పాండే. నేను బతికే ఉన్నాను. అలాగే భారత్ గెలుస్తుంది. ఇండియా జీతేగా అని రాసి ఉంది . మరొకదానిపై పాకిస్తాన్ బ్యాటింగ్ ను టార్గెట్ చేస్తూ.. నేను క్రియేట్ చేసే కాంట్రవర్సీలు సైతం పాకిస్తాన్ బ్యాటింగ్ కంటే ఎక్కువ సేపు నిలుస్తాయి. ఇండియా జీతేగా అంటూ రెండో ప్లకార్డ్ పై రాసి ఉంది.
ఈ ప్లకార్డుల ప్రదర్శన చూసి జనాలు ఆగారు. కాసేపు నవ్వుకొని, మరికొందరు ఆమెతో కలిసి టీమ్ఇండియాకు మద్దతుగా నినాదాలు కూడ చేశారు. ఆమెను ఫొటోలు తీసుకున్నారు. దీంతో పూనమ్ సింగిల్ గా మొదలుపెట్టిన ఈ ప్రదర్శన చిన్న ర్యాలీలా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను పూనమ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ముంబయి వీధుల్లో ప్లకార్డ్ పట్టుకొని నిల్చొని ఉన్నారు.
క్రౌడ్ ను ముంబయి వీధుల్లోకి తీసుకొచ్చా. అందరూ స్పష్టంగా, బిగ్గరగా ఇండియా జీతేగా అని చెబుతున్నారు. అత్యంత కాంట్రవర్సీ క్రికెట్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. మీరు రెడీనా. అంటూ ఈ పోస్ట్ కు ఆమె రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాయి. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు సింపుల్ వీడియోలు లేదా దేశభక్తి పోస్టులతో సరిపెట్టుకుంటే.. పూనమ్ మాత్రం ఫుల్ ఎనర్జీ, ఫుల్ డ్రామాతో ప్రచారానికి దిగారు.
దేశభక్తి, పబ్లిసిటీ, పెర్ఫార్మెన్స్ఈ మూడు కలిపి క్రికెట్ మానియా అంటే ఏమిటో ఆమె మళ్లీ గుర్తు చేశారు. ఆమె చేసిన ఈ ప్రచారం క్రికెట్ ఫీవర్ అనేది కేవలం మైదానంలో రన్స్, వికెట్ల గురించే కాదు.. స్టేడియం బయట జరిగే హంగామా, థ్రిల్లింగ్ కూడా ఉంటుందని సందేశం ఇచ్చాయి. ఇలా ఓ వైపు మ్యాచ్.. మరోవైపు ముంబయిలో పూనమ్ ఈ డ్రామా ఫ్యాన్స్ కు ఆకట్టుకున్నాయి.