మోనికాకి మొత్తం ఇచ్చాను : పూజా హెగ్డే
తాజాగా ఈ ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేసిన విషయం తెల్సిందే.;
టాలీవుడ్‌లో మూడు నాలుగు ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన హీరోయిన్ పూజా హెగ్డే. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో, ఎక్కువ మంది స్టార్స్‌తో కలిసి నటించిన ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్‌కి కాస్త దూరంగా ఉంటుంది. టాలీవుడ్ నుంచి ఈమెకు ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రాకపోవడంతో మొత్తం దృష్టి తమిళ ఇండస్ట్రీపై పెట్టింది. ఈ అమ్మడు రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 28 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న పూజా హెగ్డే తన అందమైన ఫోటోలతో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచుతూ, అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ చేసిన విషయం తెల్సిందే. ఆ పాట చిత్రీకరణ సమయంలో తీసుకున్న ఈ ఫోటోను పూజా హెగ్డే ఇప్పుడు షేర్ చేసింది. మోనికా మోనికా అంటూ సాగే పాటలో రజనీకాంత్‌తో కలిసి పూజా హెగ్డే స్టెప్స్ వేసినట్లు సమాచారం అందుతోంది. గ్లామర్ డాల్‌గా పూజా హెగ్డేను ఈ పాటలో చూడబోతున్నట్లు చెబుతున్నారు. అందమైన పూజా హెగ్డే ఇలా రెడ్ డ్రెస్‌లో మరింత అందంగా కనిపిస్తుంది. ఇంత అందంగా ఇన్‌స్టాలో కనిపిస్తున్న పూజా హెగ్డే.. వెండి తెరపై బిగ్ స్క్రీన్ లో మరింత అందంగా పూజా హెగ్డే కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఫోటోను షేర్ చేసిన పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో... మోనికా మోనికాపై మీకు ఉన్న ప్రేమకు ధన్యవాదాలు, నా కెరీర్ లో అత్యంత కఠినమైన మరియు డిమాండ్ ఉన్న పాటల్లో ఇది ఒకటి. తీవ్రమైన ఉత్కంఠను ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్నారు, రాబోయే నెలల్లో ఈ పాట దుమ్ము లేపడం ఖాయం అంది. .... డాన్స్ చేస్తున్న సమయంలో తేమ, దుమ్ము, బొబ్బలు, స్పీడ్ డాన్స్ మూమెంట్స్ ఇలా అన్ని విధాలుగా మోనికా మోనికా పాట కోసం కష్టపడ్డట్లుగా చెప్పుకొచ్చింది. నేను మోనికాకు నా బెస్ట్ ఇచ్చాను, పాట కోసం అన్ని విషయాల్లోనూ మొత్తం ఇచ్చాను. ఇది థియేటర్లలో చూడటానికి ఒక బ్లాస్ట్ అవుతుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ టాస్క్ లో నాకు అండగా నిలిచి, అన్నింటిలో నాకు ఎనర్జీని ఇచ్చిన డ్యాన్సర్లకు స్పెషల్ గా సెల్యూట్ చేస్తున్నాను.
పూజా హెగ్డే ఈ ఏడాదిలో ఇప్పటికే దేవ, రెట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో మరో సినిమాతో అయినా విజయం దక్కుతుందా అని పూజా హెగ్డే ఎదురు చూస్తుంది. కూలీ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా, పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. కూలీ సినిమా మాత్రమే కాకుండా పూజా హెగ్డే మరికొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది. విజయ్‌తో కలిసి జన నాయగన్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. త్వరలో ఆ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. మరో వైపు లారెన్స్ తో కలిసి కాంచన 4 సినిమాను సైతం పూజా హెగ్డే చేస్తోంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి.