అవార్డ్స్ వేడుకల్లో గ్లామర్ టచ్ తో సెగలు పుట్టించిన పూజా హెగ్డే!
స్లీవ్ లెస్ మెరూన్ రెడ్ కలర్ బాడీ ఖాన్ డ్రెస్ ధరించి.. బెడ్ పై ఒక సైడ్ కి తలవాల్చి షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో పొడుగు కాళ్ల సుందరిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఇటీవల తాజాగా సినిమా వికటన్ అవార్డ్స్ 20 25 లో భాగంగా పాన్ ఇండియా స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకొని అందరిని ఆకర్షించింది. ఈ మేరకు తాజాగా అవార్డు అందుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఒక క్యాప్షన్ కూడా షేర్ చేసింది. స్లీవ్ లెస్ మెరూన్ రెడ్ కలర్ బాడీ ఖాన్ డ్రెస్ ధరించి.. బెడ్ పై ఒక సైడ్ కి తలవాల్చి షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
పాన్ ఇండియా స్టైల్ ఐకాన్ ఆఫ్ ది అవార్డు.
ఇకపోతే అవార్డు అందుకున్న అద్భుతమైన క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఇదెంత అద్భుతమైన వారం.. పాన్ ఇండియా స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం నుండి మా స్కూల్ ఈవెంట్ కి నేను ముఖ్య అతిథిగా హాజరై, మా ఉపాధ్యాయులందరినీ కలవడం వరకు.. వారం చాలా అద్భుతంగా ముగిసింది. నేను ఎవరికి కనిపించకుండా.. నా స్కూల్ కారిడార్లలో పెద్దపెద్ద కలలు కంటూ తిరుగుతూ.. చిన్నగా చదువులో మునిగిపోయి అంతర్ముకురాలై.. అత్యంత సిగ్గు కలిగిన అమ్మాయి తన కృషికి గుర్తింపు లభించి ప్రశంసలు అందుకున్నందుకు కృతజ్ఞతతో, ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ముందు ఇంకా ఎన్నో పనులు, సాధించాల్సిన కలలు, జయించాల్సిన ప్రపంచం ఉన్నాయి. . ఎందుకంటే మా స్కూల్లో ఎప్పుడు చెప్పినట్లుగానే కృషి లేకుండా గొప్పతనం లేదు అందుకే ముందుకు సాగుదాం.. కష్టపడి ఇంకా మన కలలను నిజం చేసుకుందాం" అంటూ తన పాత స్మృతులను గుర్తు చేసుకుంటూ అభిమానులతో పంచుకున్న ఈ కొటేషన్, ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సక్సెస్ కోసం పూజా హెగ్డే పోరాటం..
పూజా హెగ్డే విషయానికి వస్తే.. ఒకప్పుడు ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ఆ తర్వాత తన అద్భుతమైన నటనతో ఊహించని విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఈమధ్య సక్సెస్ కోసం గట్టిగా పోరాటం చేస్తోంది.నిజానికి గతంలో వచ్చిన సినిమాలు ఏవి ఫలితాన్ని అందించలేదు. కానీ రజనీకాంత్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది విజయ్ చివరి సినిమా జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దాదాపుగా ఏడు నెలలుగా వాయిదా వేసుకుంటూ వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూలై 15 లేదా 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పూజా హెగ్డే తదుపరి చిత్రాలు..
అలాగే దుల్కర్ సల్మాన్ 41వ చిత్రంలో కూడా పూజా హెగ్డే హీరోయిన్గా అవకాశం అందుకుంది. ఈ చిత్రాలతో పాటు రాఘవ లారెన్స్ హారర్ కామెడీ ఫ్రాంచైజ్ కాంచన 4 లో కూడా నటిస్తోంది. మొత్తానికైతే వరుస అవకాశాలు అందుకుంటుంది కానీ మునుపటి వైభోగం మాత్రం లభించలేదని చెప్పాలి. మరి ఈ సినిమాలు పూజ హెగ్డే కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడతాయో చూడాలి.