ఉత్తరాల ఊర్వశి మదిలో ప్రేమలేఖలెన్నో!
ఆ సంగతి పక్కన బెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 1980-90 కాలం నాటి రోజుల్లోకి వేటిని గుర్తు చేసుకుంటారంటే? `ఉత్తరాలంటు` ఠకీమని సమాధానం ఇచ్చింది.;
ముంబై బ్యూటీ పూజాహెగ్డే కెరీర్ సౌత్ లో మళ్లీ స్పీడప్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో కొత్త ఛాన్సుల తో హోరెత్తిస్తుంది. సూర్య, విజయ్, కార్తీ లాంటి స్టార్స్ తో ఛాన్సులందంటుకుంటూ గొప్ప కంబ్యాక్ ఇవ్వబోతుంది. టాలీవుడ్ లో సైతం ఇదే దూకుడు చూపించాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అక్కడంత ఈజీగా ఇక్కడ ఛాన్సులివ్వడం లేదు. అమ్మడిని అంతా హోల్డ్ లో పెట్టి ప్లీప్ వెయిట్ అంటు న్నారు.
ఆ సంగతి పక్కన బెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 1980-90 కాలం నాటి రోజుల్లోకి వేటిని గుర్తు చేసుకుంటారంటే? `ఉత్తరాలంటు` ఠకీమని సమాధానం ఇచ్చింది. `వాట్సాప్ లేని ఆ రోజులు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే నాకు మెసెజింగ్ చేయడం అంటే నచ్చదు. ఆరోజుల్లో ఎవరితో మాట్లాడలన్నా చక్కగా ఒకరికొకరు లెటర్లు రాసుకునేవారు. ఇప్పుడా రోజులు కోల్పోయాం. ఆరోజుల్లో ఒకరికి లేఖ రాస్తే అవతలి వారు రాసే లేఖ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లం.
ఆ ఎదురు చూపులకు ఓ విలువ ఉండేది. పేపరు పెన్ను పట్టుకుని మన భావోద్వేగాలకు అక్షర రూపం ఇవ్వడంలో ఓ భావోద్వేగం ఉంది. అదొక అద్భుతమైన కళ. దాన్ని ఇప్పుడున్న డేటా లా ఎవరూ డిలీట్ చేయలేరు. అవతాలి వాళ్ల ఎమోషన్స్ లేఖ రూపంలో ఫిజికల్ గా స్పృషించగలం. అలాంటి సింపుల్ జీవితాన్ని.. అందులో అద్భుతమైన క్షణాలు కోల్పోయాం. నా జీవితంలో చాలా లేఖలు రాశాను.
నాకు చాలా లేఖలు అందాయి. అందులో ప్రేమ లెఖలెన్నో. వాటినిప్పుడు గుర్తు చేసుకుంటే మనసు పుల్లకించిపోతుంది. బాధ నిండిన క్షణాల్లో వాటిని గుర్తు చేసుకుంటే బాధను సైతం మర్చిపోతాను` అంది. పూజాహెగ్డే సమాధానం చాలా మంది హృదయాలను తాకుతుంది. యోగ క్షేమాలను తెలుపు రాసే ఉత్తరంలో ఎంతో ఎమోషన్ ఉండేది. ప్రియమైనా, పూజ్యులైన, గౌరవనీయులైన వంటి పదాలను ఉత్తరాలతోనే కోల్పోయాం. పెరిగిన టెక్నాలజీతో తెలుగు భాషనే మర్చిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.