మోనికా వెండి తెరపై ఏం చేసేనో...?

పూజా హెగ్డే కూలీ సినిమాతో పాటు సూపర్ స్టార్‌ విజయ్‌ హీరోగా నటించిన తమిళ్‌ మూవీ 'జన నాయగన్‌' లోనూ నటించింది.;

Update: 2025-08-11 11:30 GMT

అల్లు అర్జున్‌, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'డీజే' సినిమాతో హీరోయిన్‌గా ఓవర్ నైట్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచిన పూజా హెగ్డే దాదాపు ఐదేళ్ల పాటు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా సినిమాలు చేసింది. టాలీవుడ్‌లోని యంగ్‌ స్టార్‌ హీరోలందరితోనూ నటించిన ఘనత దక్కించుకుంది. మహేష్ బాబు నుంచి మొదలుకుని ప్రభాస్ వరకు యంగ్‌ హీరోలతో ఒక రౌండ్‌ వేసి నటించేసిన పూజా హెగ్డే తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో ఖాళీగా మారి పోయింది. పాపం పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలం అయింది. టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గిన సమయంలో బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కాయి. కానీ అక్కడ సినిమాలు హిట్‌ కావడం లేదు. కోలీవుడ్‌లోనూ ఈమె పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. కానీ అక్కడ కూడా పాజిటివ్ ఫలితాలు రావడం లేదు.

పూజా హెగ్డే మోనికా పాట వైరల్‌

హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి ఈ మధ్య కాలంలో హిట్‌ కాలేదు. మొన్నటికి మొన్న వచ్చిన రెట్రో, దేవ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ అమ్మడు కూలీ సినిమా కోసం వెయిట్‌ చేస్తోంది. కూలీ సినిమాలో ఐటెం సాంగ్‌ను చేయడం ద్వారా పూజా హెగ్డే మరోసారి వార్తల్లో నిలిచింది. పూజా హెగ్డే చేసిన మోనికా పాటకు మంచి రెస్పాన్స్‌ దక్కింది. అందులో పూజా హెగ్డే కంటే సౌబిన్ కు ఎక్కువ పేరు వచ్చినప్పటికీ ఆ పాటలో ఈమె ఉండటం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. రజనీకాంత్‌ తో కాకుండా సౌబిన్‌ తో ఐటెం సాంగ్‌ చేసేందుకు ఓకే చెప్పడంతో ఖచ్చితంగా ముందు ముందు ఈమెకు లక్‌ కలిసి వస్తుందని అంతా బలంగా నమ్ముతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ పాట గురించి పుంకాను పుంకాలుగా చర్చ జరుగుతోంది.

రజనీకాంత్‌ కూలీ రిలీజ్ కి రెడీ

ఆగస్టు 14న కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా ప్రీ సేల్‌ ద్వారా ఇప్పటికే దాదాపుగా రూ.75 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. విడుదల సమయం వరకు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చి, రూ.500 కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాక్సాఫీస్‌ వద్ద కూలీ సినిమా పాజిటివ్‌గా నిలబడితే ఖచ్చితంగా పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోనికా పాట గత కొన్ని వారాలుగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత కూడా సందడి చేస్తే పూజా హెగ్డే కు హీరోయిన్‌గా వరుస ఆఫర్లు రావచ్చు.

నితిన్ సినిమాలో పూజా హెగ్డే

పూజా హెగ్డే కూలీ సినిమాతో పాటు సూపర్ స్టార్‌ విజయ్‌ హీరోగా నటించిన తమిళ్‌ మూవీ 'జన నాయగన్‌' లోనూ నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం వచ్చే సంక్రాంతికి రాబోతుంది. ఆ సినిమా పైనా పూజా హెగ్డే కి చాలా నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే మరో వైపు నితిన్‌ తో తెలుగులో ఒక సినిమాను చేయడం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న నితిన్‌ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. మోనికా పాట వెండితెరపై అలరిస్తే పూజా హెగ్డేకి మరిన్ని ఆఫర్లు వస్తాయని, అందులో భాగంగానే నితిన్‌తో సినిమా కన్ఫర్మ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News