పూజా హెగ్డే ఇక సర్దేసినట్టేనా..?
ఈ రెండు సినిమాలతో మళ్లీ తమిళంలో తన ఫ్యాన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యింది.;
బుట్ట బొమ్మ పూజా హెగ్దేకి బ్యాడ్ టైం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అమ్మడు చేస్తున్న ఏ అటెంప్ట్ కూడా వర్క్ అవుట్ అవ్వట్లేదు. సౌత్ లో మొన్నటిదాకా టాప్ హీరోయిన్ గా ఫాం కొనసాగించిన ఈ అమ్మడు ఇప్పుడు ఇక్కడ అవకాశాలు లేక కెరీర్ లో వెనకపడి ఉంది. 2023 లో కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమా చేసింది. సల్మాన్ ఖాన్ సరసన నటించిన అమ్మడు ఆ సినిమాతో సక్సెస్ వస్తుందని ఆశించగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. ఇక ఆ షాక్ తో ఏడాది పాటు ఛాన్స్ లు రాలేదు.
సూర్యతో రెట్రో మూవీ..
ఇక ఈ ఇయర్ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో దేవ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా అది ఫ్లాప్ అయ్యింది. సూర్యతో రెట్రో మూవీ చేయగా అది కూడా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు. ఇక ఈమధ్యనే సూఅప్ర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో మోనిక సాంగ్ తో మెస్మరైజ్ చేసింది పూజా హెగ్దే. ఆ సాంగ్ హిట్ అయినా కూడా పూజా హెగ్దేకి పెద్దగా ఉపయోగపడలేదు.
తెలుగులో రాధే శ్యాం తర్వాత అమ్మడికి ఛాన్స్ లు రావట్లేదు. గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అవ్వడమే అమ్మడు చేసిన పెద్ద మిస్టేక్ గా మారింది. అప్పటి నుంచి పూజా హెగ్దేకి అవకాశాలు కరువయ్యాయి. తెలుగులో సినిమాలు లేవు కానీ ప్రెజెంట్ కోలీవుడ్ లో ఛాన్స్ లు అందుకుంటుంది పూజా హెగ్దే. ఆల్రెడీ దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ లో నటిస్తుంది పూజా హెగ్దే. ఆ సినిమాతో పాటు కాంచన 4లో కూడా ఛాన్స్ అందుకుంది.
హై జవాని తో ఇష్క్ హోనా హై సినిమ..
ఈ రెండు సినిమాలతో మళ్లీ తమిళంలో తన ఫ్యాన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యింది. ఇదే కాకుండా హిందీలో హై జవాని తో ఇష్క్ హోనా హై సినిమా చేస్తుంది. వరుణ్ ధావన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాతో అయినా అక్కడ ఒక సక్సెస్ అందుకోవాలని చూస్తుంది పూజా హెగ్దే.
సౌత్ లో ముఖ్యంగా తెలుగులో పూజా బేబ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా ఇక్కడ పెద్దగా అవకాశాలు రావట్లేదు. దానికి రీజన్స్ కూడా పెద్దగా ఏం లేవు. పూజా హెగ్దె మరో సూపర్ హిట్ కొడితే కచ్చితంగా తెలుగులో కూడా ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే యువ హీరోలు పూజా హెగ్దేతో జత కట్టాలని ఆసక్తిగా ఉన్నారట. మరి అది ఎప్పుడు ఎలా కుదురుతుంది అన్నది చూడాలి. కెరీర్ పరంగా కాస్త టఫ్ టైం నడుస్తున్న ఇలాంటి సందర్భంలో పూజా హెగ్దేకి ఒక మంచి సూపర్ హిట్ సినిమా పడాలి. అది సెట్ అయితే మళ్లీ కెరీర్ రైట్ ట్రాక్ లోకి వచ్చేస్తుంది.