వాటికే మొదటి ప్రాధాన్యత.. భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదా?
ఎవరికైనా సరే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఏ పాత్రలో అయితే అవకాశం లభిస్తుందో.. ఆ తర్వాత చిత్రాలలో కూడా దాదాపు అవే పాత్రలు తలుపు తడతాయి.;
ఎవరికైనా సరే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఏ పాత్రలో అయితే అవకాశం లభిస్తుందో.. ఆ తర్వాత చిత్రాలలో కూడా దాదాపు అవే పాత్రలు తలుపు తడతాయి. అందుకే ఎవరైనా సరే ఒక విభాగంలో సెటిల్ కావాలి అంటే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని మరీ ఆయా పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే కాదు ఆ తర్వాత కాలంలో కూడా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలనే చూస్తారు. కానీ కొంతమంది మాత్రం తప్పని పరిస్థితుల్లో అవకాశాలు లేక చేసే పనులు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి అన్న విషయాన్ని మర్చిపోతున్నారు అని అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. తన అందంతో, నటనతో బుట్టబొమ్మగా పేరు కూడా దక్కించుకుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల సరసన నటించి క్రేజ్ సొంతం చేసుకున్న పూజా హెగ్డే.. ఆ తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ అవకాశాలు అందుకుంటున్న ఈమె.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎక్కువగా స్పెషల్ సాంగ్ లకు మొదటి ప్రాధాన్యత ఇస్తుండడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
విషయంలోకి వెళ్తే.. తెలుగులో అవకాశాలు పెద్దగా అందుకోలేకపోతున్న పూజా హెగ్డే.. తమిళంలో సూర్య సరసన రెట్రో అనే సినిమా చేసి డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఇప్పుడు విజయ్ దళపతి హీరోగా వస్తున్న జన నాయగన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు హిందీలో దేవా అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే.. ప్రస్తుతం ఈమె స్పెషల్ సాంగ్ లు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఇదివరకే లోకేష్ కనగరాజు , రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన కూలీ సినిమాలో మోనిక అనే స్పెషల్ సాంగ్లో చేసి భారీ పాపులారిటీ అందుకుంది.పైగా సినిమాలలో నటిస్తే 3 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే ఈమె.. స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని ఆశ్చర్యపరిచింది.
ఇకపోతే ఇప్పుడు అట్లీ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతుందని సమాచారం. ఇందులో కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి 5 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇలా ఇప్పుడు ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు స్పెషల్ సాంగ్ లు కూడా చేస్తుండడంతో అటు హీరోయిన్గా కలిసి రావడం లేదు కాబట్టి స్పెషల్ సాంగ్ లతో భారీగా ఆదాయం పొందుతోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండగా.. ఆదాయం కోసం వరుసగా స్పెషల్ సాంగ్ లు చేస్తూ పోతే భవిష్యత్తులో స్పెషల్ సాంగులు చేసుకోవడం తప్ప హీరోయిన్గా అవకాశాలు రావు అని, ఈ విషయాన్ని పూజ హెగ్డే మరిచిపోతోందా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాదు ఇదే విషయంలో తమన్నాను కూడా లాగుతూ ఉండడం గమనార్హం. ఒకప్పుడు హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకున్న తమన్నా.. ఎక్కువగా స్పెషల్ సాంగ్లు చేయడంతో ఇప్పుడు సౌత్ , నార్త్ అని తేడా లేకుండా ఈమెకు ఎక్కువగా స్పెషల్ సాంగ్ లనే ఆఫర్లు చేస్తున్నారు. ఇక పూజ హెగ్డే కూడా వరుసగా స్పెషల్ సాంగ్లకు ఓటు వేస్తే మాత్రం భవిష్యత్తులో తిప్పలు తప్పవని హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం. మరి దీనిపై పూజా హెగ్డే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.