వీడియో : పూజా హెగ్డే మాస్ స్టెప్స్ చూసారా?

మొన్న‌టివ‌ర‌కు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే చేతిలో ప్ర‌స్తుతం ఎక్కువ ఆఫ‌ర్లేమీ లేవు.;

Update: 2025-03-29 07:44 GMT

మొన్న‌టివ‌ర‌కు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే చేతిలో ప్ర‌స్తుతం ఎక్కువ ఆఫ‌ర్లేమీ లేవు. రాధేశ్యామ్ సినిమా త‌ర్వాత పూజాకు వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో ఆ ఎఫెక్ట్ అమ్మ‌డి అవ‌కాశాల‌పై ప‌డింది. వ‌రుస ఫ్లాపుల మూలంగా పూజాకు క్ర‌మంగా అవ‌కాశాలు తగ్గాయి. ప్ర‌స్తుతం పూజా కోలీవుడ్ లో సూర్య స‌ర‌స‌న సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య హీరోగా చేస్తున్న రెట్రో సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాను సొంత బ్యాన‌ర్ లో సూర్య, అత‌ని భార్య జ్యోతిక నిర్మిస్తున్నారు. ల‌వ్, వార్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ ఉండ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే రిలీజైన రెట్రో గ్లింప్స్ ద్వారా మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

పూజా నుంచి చాలా కాలం త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో రెట్రో పై అమ్మ‌డు చాలానే ఆశ‌లు పెట్టుకుంది. మే 1న రెట్రో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్టింది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మేక‌ర్స్ రెట్రో నుంచి ఓ ఎన‌ర్జిటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బుజ్జ‌మ్మ అంటూ సాగే ఈ పాట విన‌డానికి బాగా క్యాచీగా ఉంది.

సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తూ పాడిన ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించ‌గా, ఈ సాంగ్ రిలీజైన కాసేప‌టికే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మరీ ముఖ్యంగా సూర్య ఫ్యాన్స్ కు ఈ పాట భ‌లే న‌చ్చేసింది. అయితే ఈ సాంగ్ రిలీజైన‌ప్ప‌టి నుంచి ట్యూన్ తో పాటూ మ‌రో విష‌యం గురించి కూడా ఆడియ‌న్స్ మాట్లాడుకుంటున్నారు.

అది మ‌రేదో కాదు, సాంగ్ లోని డ్యాన్సులు. బుజ్జమ్మ సాంగ్ లో పూజా, సూర్య వేసిన స్టెప్పులు చాలా క్రేజీగా ఉన్నాయి. అయితే పూజా సినిమాల్లో ఏదొక సాంగ్ నుంచి ఆమెకు ఒక హుక్ స్టెప్ ఉంటుంది. ఆ హుక్ స్టెప్ ను పూజా చాలా కొత్త‌గా వేస్తుంది. గ‌తంలో అల వైకుంఠ‌పుర‌ములో బుట్ట‌బొమ్మ స్టెప్పుతో పాటూ, బీస్ట్ లోని అర‌బిక్ కుతు సాంగ్ లో పూజా వేసిన స్టెప్పులు ఇప్ప‌టికీ చాలా ఫేమ‌స్. చూస్తుంటే ఇప్పుడు బుజ్జ‌మ్మ సాంగ్ లో చీర క‌ట్టుకుని పూజా వేసిన స్టెప్పులు కూడా అంతే ఫేమ‌స్ అయ్యేలా అనిపిస్తున్నాయి.



Full View


Tags:    

Similar News