బుట్ట‌బొమ్మ క్యాల‌రీలు క‌రిగించే క‌ళ‌

తాజాగా తన రోజువారీ తిండి వ్యాయామ‌ షెడ్యూల్ ని రివీల్ చేసింది. నేలపై పడుకుని కేలరీలు బర్న్ చేస్తూ.. బ్రెడ్ - నూడుల్స్ తినడం వ‌గైరా వ‌గైరా విషయాల‌ను షేర్ చేసింది.;

Update: 2025-05-17 12:49 GMT

ప్ర‌తి సినిమాకి మార్పు అవ‌స‌రం. ఆర్టిస్ట్ లుక్ మారాలి. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు శ‌రీరాకృతిని మ‌లుచుకోవాలి. దాని కోసం తిండి క‌ట్టేయాలి. తినే ప‌దార్థాలు మారాలి. ఇలాంటి ప్ర‌యోగాలు క‌థానాయిక‌ల‌కు కొత్తేమీ కాదు. ముఖ్యంగా వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే నిరంత‌రం త‌న డైట్ చార్ట్ మార్చేస్తుంది. తన పాత్ర‌కు త‌గ్గ‌ట్టు శ‌రీరాకృతిని తీర్చిదిద్దుకుంటుంది. రెట్రో కోసం కొంత బొద్దెక్కిన ఈ బ్యూటీ ఇప్పుడు అనూహ్యంగా డైట్ మార్చేసింది.

 

తాజాగా తన రోజువారీ తిండి వ్యాయామ‌ షెడ్యూల్ ని రివీల్ చేసింది. నేలపై పడుకుని కేలరీలు బర్న్ చేస్తూ.. బ్రెడ్ - నూడుల్స్ తినడం వ‌గైరా వ‌గైరా విషయాల‌ను షేర్ చేసింది. ఫిట్ నెస్ కోసం త‌పించ‌డంలో పూజా త‌గ్గేదేలే! అని నిరూపిస్తోంది. ఇది సినిమా కోసం కాదు.. మంచి రూపం కోసం ప్ర‌య‌త్నం. శ‌రీరం నుంచి అవ‌స‌రం లేని ఫ్యాట్ ని తొల‌గించి తిరిగి త‌న పాత రూపానికి మారేందుకు పూజా ఇలా క‌ఠిన వ్యాయామం చేస్తోంది.

పూజా ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాల‌తో బిజీబిజీగా ఉంది. త‌దుప‌రి వరుణ్ ధావన్ - మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఒక హిందీ సినిమా చేస్తోంది. కాంచన 4, జన నాయగన్, కూలీ చిత్రాలలోను న‌టిస్తోంది. టాలీవుడ్ లోను కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతానికి త‌మిళంపై ఆధార‌ప‌డిన ఈ బ్యూటీ హిందీలోను పెద్ద అవ‌కాశాల కోసం వెయిట్ చేస్తోంది.

Tags:    

Similar News