తాగి తంద‌నాలాడొద్దంటూ న‌టుడు హిత‌వు!

కోలీవుడ్ న‌టుడు పొన్నాంబ‌ళం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. ద‌క్షిణాదిన 1500 పైగా చిత్రాల్లో న‌టించిన న‌టుడు.;

Update: 2025-07-28 05:09 GMT

కోలీవుడ్ న‌టుడు పొన్నాంబ‌ళం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. ద‌క్షిణాదిన 1500 పైగా చిత్రాల్లో న‌టించిన న‌టుడు. అప్ప‌టి స్టార్ హీరోల చిత్రాల్లో విల‌న్ పాత్ర‌లంటే? పొన్నాంబ‌ళ‌మే గుర్తొస్తారు. ర‌జ‌నీకాంత్, క‌మల్ హాస‌న్, చిరంజీవి , బాల‌కృష్ణ‌, నాగార్జున లాంటి హీరోల‌కు అప్ప‌ట్లో విల‌న్ పొన్నాంభ‌ళ‌మే. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ గ‌ల న‌టుడు. ఆమ‌ధ్య పొన్నాంబ‌ళం మూత్ర‌పిండాల వ్యాధి బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

తీవ్ర అనారోగ్యానికి గురైన నేప‌థ్యంలో చికిత్స కూడా డ‌బ్బులు కూడా లేని నేప‌థ్యంలో ఆర్దిక స‌హాయం అడ‌గ‌డంతో కొంత‌మంది స్టార్లు స్పందించి ల‌క్ష‌ల రూపాయ‌లు స‌హాయం అంద‌డంతో రోగం నుంచి కోలు కున్నాడు. తాజాగా మూత్ర‌పిండాల స‌మ‌స్య బారిన ప‌డిత ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది పొన్నాం బ‌ళం వివ‌రించారు.  'నాలుగేళ్ల‌లో 750 ఇంజెక్ష‌న్లు చేయించుకున్నాను. రెండు రోజుల‌కు ఒక‌సారి రెండు ఇంజె క్షన్లు చేసి ఒంట్లో ర‌క్తాన్ని డ‌యాలసిస్ పేరిట తీసేవారు.

ఇది ఎంతో న‌ర‌కంలా ఉంటుంది. ఈ ప‌రిస్థితి ప‌గోడికి కూడా రాకూడ‌దు. నాకు ఈ ప‌రిస్థితి రావ‌డానికి కార‌ణం అతిగా మ‌ద్యం సేవించ‌డం వ‌ల్లే. ఈ విష‌యాన్ని వైద్యులు చెప్పే వ‌ర‌కూ నాకు తెలీదు. నిజానికి చాలా సంవ‌త్స‌రాల క్రితమే మ‌ద్యం మానేసాను. కానీ అప్ప‌టికే శ‌రీరంలో జ‌ర‌గాల్సిన నష్టం జ‌రిగి పోయింది. మ‌ద్యం ఎప్ప‌టికైనా హానిక‌రం. చాలా మంది స‌ర‌దా కోసం, మ‌త్తు కోసం తాగుతుంటారు. అది ప‌ద్ద‌తిగా అప్పుడ‌ప్పుడు అయితే ప‌ర్వాలేదు.

కానీ బానిస‌గా మారితే మాత్రం జీవితంలో చాలా తీవ్ర‌మైన ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ బాధ‌ను అనుభ‌వించిన వాడిగా చెబుతున్నాను. ద‌య‌చేసి యువ‌త మద్యంలో జోలికి వెళ్లొద్దు. నాలాంటి వాడికి ఎంతో మంది స‌హాయం చేసారు కాబట్టే బ్ర‌త‌క‌గ‌లిగాను. సామాన్యులు ఇలాంటి అనారోగ్యం బారిన ప‌డితే ఆ కుటుంబం ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌`న్నారు. ఇటీవ‌లే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంక‌ట్ కిడ్నీ వ్యాధి బారిన ప‌డి మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. వ్య‌స‌నాల కార‌ణంగానే అనారోగ్యానికి గురైన‌ట్లు తెలిసింది.

Tags:    

Similar News