'పోలీస్ పోలీస్' టాక్: క్లిక్కయ్యిందా లేదా?

జియోహాట్‌స్టార్‌లో వచ్చిన కొత్త సిరీస్ పోలీస్ పోలీస్ టీజర్ ట్రైలర్ తో మొదటి నుంచి కొంత హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది.;

Update: 2025-09-23 03:48 GMT

జియోహాట్‌స్టార్‌లో వచ్చిన కొత్త సిరీస్ పోలీస్ పోలీస్ టీజర్ ట్రైలర్ తో మొదటి నుంచి కొంత హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. ఈ కథ ప్రధానంగా మిర్చి సెంథిల్, జయసలీన్ నటనతో ముందుకు సాగుతుంది. వీరి కెమిస్ట్రీ, కాంప్లిమెంటింగ్ రోల్స్ సిరీస్‌కి బలాన్ని ఇస్తాయి. సెంథిల్ చేసిన రిజిడ్, నో నాన్స్‌స్ పోలీస్ పాత్రలో డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ బాగానే కుదిరింది. జయసలీన్ మాత్రం ప్లేఫుల్ క్యారెక్టర్‌లో ఎనర్జీని తీసుకువచ్చాడు.

ఈ ఇద్దరి మధ్య కాంట్రాస్ట్ కథని మోసేలా కనిపిస్తుంది. ఇక శబనా షాజహాన్, వడివుక్కరాసి, సుజిత పాత్రలు పరిమితమైనా అవసరమైనంత ఇంపాక్ట్ ఇచ్చాయి. కథ విషయానికి వస్తే, సిరీస్ ఒక పోలీస్ స్టేషన్ లో జరిగే ఇంటర్నల్ పొలిటిక్స్, క్రైమ్ కేసుల చుట్టూ తిరుగుతుంది. ఎస్‌ఐ రాజా అనే యంగ్ అగ్రెసివ్ ఆఫీసర్‌కి, మురళి అనే గ్యాంబ్లర్ జీవితానికి ఈ కథ కనెక్ట్ అవుతుంది.

మురళి గతాన్ని వదిలి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయాణంలోనే రాజాకి సపోర్ట్ చేస్తూ, అతని కేసుల్లో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ క్రమంలో రాజా ఒక రాజకీయ నేత కొడుకును పట్టుకోవడం వల్ల తలనొప్పులు ఎదుర్కుంటాడు. ఇక్కడే అతని సహచరుడు వావర్ ప్రాధాన్యం పెరగడం మొదలవుతుంది.

ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్‌లో ఎక్కువగా రాజా తన పనిలో చూపే అగ్రెసివ్ స్టైల్, మురళి రిఫార్మ్ కావాలనే డిసైషన్ మీదనే ఫోకస్ ఉంటుంది. ఒక వైపు మురళి తల్లి తన కొడుకు మారాలని ఆశించడం, మరోవైపు అతని లవ్ ట్రాక్ లాయర్ లలితాంబికాతో మొదలవడం కథకి ఎమోషనల్ టచ్ ఇస్తాయి. రాజా తండ్రి కూడా పోలీస్ కావడం, కొడుకు కాస్త ఈజీగా తీసుకోవాలని చెప్పినా అతను వినకపోవడం కథలోని అసలు లైన్ ని చూపిస్తుంది.

సిరీస్‌లో లేడి క్యారెక్టర్ల ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజా కి బాస్‌గా ఉన్న ఆఫీసర్, అతని పనిలో సరైన గైడెన్స్ ఇస్తుంది. మురళి తల్లి పాత్ర మాత్రం ఎమోషనల్ బ్యాక్‌బోన్‌గా నిలుస్తుంది. అలాగే లాయర్ పాత్ర కూడా కథని మరో కోణంలో చూపిస్తుంది. వీరి వల్లే కథలో ఊహించని మార్పులు వస్తాయి. టెక్నీకల్ గా చూస్తే జేమ్స్ విక్టర్ కంపోజ్ చేసిన టైటిల్ ట్రాక్ బాగానే కట్టిపడేస్తుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగానే ఉంది. సినిమాటోగ్రాఫర్ కూలీ సౌందర్‌ రాజన్ విజువల్స్‌ని క్లీన్‌గా హ్యాండిల్ చేశాడు.

ఎపిసోడ్స్ పర్ఫెక్ట్ రన్‌టైమ్‌తో క్రిస్ప్‌గా ఉండడం వల్ల వాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైటింగ్‌లో మాత్రం కొత్తదనం లేదు. మొత్తం మీద పోలీస్ పోలీస్ సిరీస్‌లో కొత్తదనం ఏమీలేకపోయినా, టైమ్ పాస్ కోసం చూడదగ్గది. ఫ్రెష్ కంటెంట్ ఆశించే వారికి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ లైట్ వెయిట్ ఎంటర్టైన్‌మెంట్ కోరుకునేవారికి మాత్రం ఈ సిరీస్ సరిపోతుంది. క్రైమ్ డ్రామా జానర్‌లో కొత్తదనం లేకపోయినా, క్యారెక్టర్స్ సింపుల్‌గా కనెక్ట్ అయ్యేలా రాసుకోవడం వలన ఒక స్థాయిలో ఆకట్టుకునేలా ఉంటుంది.

Tags:    

Similar News