ఏం చూస్తే అదే కనబడుతుంది.. మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి..!

ఐతే దానికి డైరెక్టర్ ఫణీంద్ర సోషల్ మీడియా వేదికగా స్పందించారు.;

Update: 2025-06-23 17:27 GMT

అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్ లో ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. జూన్ 20న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. ఐతే నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ఏర్పరచిన మీడియా క్యు అండ్ ఏ లో కాశీ లాంటి పవిత్ర క్షేత్రంలో ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేలా కావాల్సి వచ్చిందా అంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించాడు. ఐతే దానికి డైరెక్టర్ ఫణీంద్ర సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇంతకీ ఫణీంద్ర ఏం రాసుకొచ్చారు అంటే బ్రాహ్మణ వర్గం మీద నాకెప్పుడూ అమితమైన గౌరవం ఉంది. సనాతన ధర్మానికి, వేదాధ్యయనానికి వారంతా అవిశ్రాంత కృషి చేస్తూనే ఉన్నారు. వారి నాలుకపై సరస్వతి కొలువై ఉంటుందని అంటారు. ఐతే ఒక వర్గం పైనే ముద్ర వేస్తూ అత్యాచారం గురించి ఆ రిపోర్టర్ ఎందుకు మాట్లాడారోఈ అర్థం కావట్లేదని అన్నారు.

నేరాలు చేసే వాళ్లు విచక్షణా స్వభావం కారణంతోనే చేస్తారు. వారి కులం, మతం ఆధారంగా చేయరు. సామాజిక హోదాకు భిన్నంగా ప్రజలు ఉంటారనే అలా చూపించే ప్రయత్నం చేశానని అన్నారు ఫణీంద్ర. ఒక వర్గాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయలేదని అన్నారు. కబేలా అనేది ఎప్పటి నుంచో ఉంది. అందుకు తగినట్టుగానే పాత్రలను ఎంచుకున్నా. మీరు ఈ విషయంలో కులాన్ని తీసుకురావాలనుకుంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా.. రావణుడు ఎవరు..? ఒక బ్రాహ్మణుడి కుమారుడు.. గొప్ప శివ భక్తుడు. నుదుటిన విభూతి, మెడలో రుద్రాక్ష ధరిస్తాడు.

మరి ఆయనలో మారింది ఏంటి..? ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు, పురాణ గ్రంధాలు అవపోసన పట్టి చివరకు ఆయన ఏం చేశాడు..? మనిషి ప్రవర్తన, ఆలోచన బట్టే నేరం చేస్తాడు. అతని కులం, మతం కారణం కాదు. అది మానవ నైజం.. యద్భావం తద్భవతి.. మీరు ఏం చూస్తారో మీకు అదే కనబడుతుంది... మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి.. దయచేసి అనవసరమైన విషయాలు ఇందులో కలపకండి అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు వేదికపై పంతులు అనే పదం ఆమె అనకుండా ఉండాల్సింది మీరు దాన్ని సరిచేయడంలో తప్పులేదు. అక్కడితే దాన్ని వదిలేస్తే బాగుండేది థాంక్యూ అంటూ డైరెక్టర్ ఫణీంద్ర క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News