పెద్ది సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?
చికిరి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలతో వరుస ఫ్లాపులను అందుకున్న రామ్ చరణ్ ఈ మూవీతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ఎంతో కసిగా ఉన్నారు.
పెద్ది కోసం మేకోవర్ అయిన చరణ్
అందుకే పెద్ది కోసం చరణ్ తెగ కష్టపడుతున్నారు. ఎంతో కష్టపడి ఈ మూవీ కోసం మేకోవర్ కూడా అయ్యారు చరణ్. రంగస్థలం తర్వాత చరణ్ నుంచి వస్తున్న మరో విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో పెద్ది పై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు బుచ్చిబాబు కూడా ఈ స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని దీన్ని రూపొందిస్తున్నారు.
చికిరి సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్
దానికి తోడు ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ షాట్ గ్లింప్స్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేశాయి. మొన్నా మధ్య వచ్చిన పెద్ది ఫస్ట్ లిరికల్ చికిరి సాంగ్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ పాటకు అన్ని భాషల్లో కలిపి 180 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఈ సాంగ్ కు 125 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ సాంగ్ సృష్టించిన హంగామా ఎంతో అర్థం చేసుకోవచ్చు.
త్వరలోనే పెద్ది నుంచి సెకండ్ సాంగ్
అంత హంగామా సృష్టించింది కాబట్టే చికిరి సాంగ్ ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చికిరి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ నుంచి రెండో సాంగ్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా న్యూ ఇయర్ కు పెద్ది నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే సంక్రాంతికి పెద్ది నుంచి సెకండ్ లిరికల్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు.
పెద్ది నుంచి సెకండ్ లిరికల్ గా ఓ రొమాంటిక్ సాంగ్ రాబోతుందని తెలుస్తోంది. వాస్తవానికి సెకండ్ సాంగ్ ను న్యూ ఇయర్‌కే రిలీజ్ చేద్దామనుకున్నారట కానీ ఆల్రెడీ చికిరి సాంగ్ హంగామా ఇంకా కొనసాగుతుండటం మరియు చిరంజీవి మూవీ మన శంకరవరప్రసాద్ గారు మూవీ రిలీజ్ హంగామా ఉండటంతో కాస్త టైమ్ తీసుకుందామని మేకర్స్ ఆ ఆలోచనను పక్కకు పెట్టారని, ఇప్పుడు సంక్రాంతికి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా అఫీషియల్ గా రానుందని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.