పెద్ది ఫస్ట్ సింగిల్ కు భలే ప్లాన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాను బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని ఇప్పటికే చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు.
పెద్ది.. 50% షూటింగ్ పూర్తి
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఆల్రెడీ పెద్ది సినిమా 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా స్టూడియోలో పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో కలిసి రామ్ చరణ్, బుచ్చిబాబు షేర్ చేసిన ఓ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతుందని వారు ఆ పోస్ట్ లో రాసుకురాగా ఇప్పుడా సాంగ్ కు డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఆ రోజే!
పెద్ది ఫస్ట్ సింగిల్ ను దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారని, కానీ ఆ సాంగ్ అనౌన్స్‌మెంట్ ను మాత్రం సెప్టెంబర్ 28న ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే యాదృచ్ఛికంగా అదే రోజు రామ్ చరణ్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత ఆ రోజే రిలీజైంది. చరణ్ సినీ ప్రస్థానానికి 18 ఏళ్లు పూర్తి కాబోతున్న సందర్భంగా పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను మేకర్స్ ప్లాన్ చేశారని అంటున్నారు.
వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది రిలీజ్
అదే నిజమైతే, మెగా ఫ్యాన్స్ కు ఈ సారి దసరాకు డబుల్ ధమాకా అందినట్టే అవుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తుండగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్ లోటును కూడా పెద్ది భర్తీ చేస్తుందని ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు.