నైజాంలో 'పెద్ది'.. టాప్-5లో ప్లేస్ దక్కించుకుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది మూవీ.. థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.

Update: 2026-06-05 09:17 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది మూవీ.. థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. మేకర్స్ ప్రకటన ప్రకారం, వరల్డ్ వైడ్ గా తొలి రోజు రూ.135 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు నైజాం మార్కెట్‌ లోనూ భారీ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

ట్రేడ్ పండితులు అంచనాల ప్రకారం, పెద్ది చిత్రం నైజాం ప్రాంతంలో తొలి రోజు సుమారు రూ.18.32 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ లెక్కల్లో జీఎస్టీ కూడా కలిపి ఉన్నట్లు సమాచారం. అయితే కేవలం ఒకే రోజులో రూ.18 కోట్లకు పైగా షేర్ రాబట్టడం చిన్న విషయం కాదని, ఇది సినిమాకు ఉన్న క్రేజ్ కు ఎగ్జాంపుల్ అని సినీ ప్రియులు చెబుతున్నారు.

నిజానికి టాలీవుడ్ కు నైజాం మార్కెట్ చాలా కీలకం. పెద్ద హీరోల సినిమాలకు నైజాంలో వచ్చే వసూళ్లు మొత్తం బాక్సాఫీస్ ఫలితాలపై ప్రభావం చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో పెద్ది సాధించిన తొలి రోజు షేర్‌ పై నెట్టను చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే, నైజాం ఆల్‌ టైమ్ డే-1 షేర్ రికార్డుల జాబితాలో పెద్ది ఏడో ప్లేస్ ను సొంతం చేసుకుంది.

నైజాంలో తొలి రోజు అత్యధిక షేర్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో పుష్ప 2: ది రూల్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ చిత్రం రూ.25.60 కోట్ల షేర్‌ తో టాప్ లో నిలిచింది. రెండో స్థానంలో ఓజీ రూ.24.45 కోట్లతో ఉండగా, మూడో స్థానంలో ఆర్ఆర్ఆర్ రూ.23.35 కోట్ల షేర్ సాధించింది. ఆ తర్వాత దేవర పార్ట్ 1 రూ.22.64 కోట్లు, సలార్ రూ.22.55 కోట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

పుష్ప 2- రూ.25.60కోట్లు

ఓజీ- రూ.24.45కోట్లు

ఆర్ఆర్ఆర్- రూ.23.35కోట్లు

దేవర పార్ట్ 1- రూ.22.64కోట్లు

సలార్- రూ.22.55కోట్లు

కల్కి 2898 ఏడీ- రూ.19.60కోట్లు

పెద్ది- రూ.18.32కోట్లు

పై లెక్కలతో పోల్చితే పెద్ది తొలి రోజు షేర్ రూ.18.32 కోట్లు కావడంతో టాప్-5 రికార్డులకు కొంత దూరంలో నిలిచినట్టే కనిపిస్తోంది. అయినప్పటికీ, వర్కింగ్ డే రోజు విడుదలై ఇలాంటి వసూళ్లు సాధించడం విశేషమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్, వీకెండ్ హాలీడేస్ కలిసి వచ్చే రోజుల్లో కలెక్షన్లను మరింత పెంచే అవకాశం ఉంది.

ఇక చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఆ చిత్రంలో దివ్యేందు శర్మ, శివ రాజ్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఏదేమైనా నైజాంలో పెద్దికి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ దక్కినా ఆల్‌ టైమ్ టాప్-5 ఓపెనింగ్స్ జాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. అయితే రెండో రోజు వచ్చే వసూళ్లు, వీకెండ్ వసూళ్లు సినిమా బాక్సాఫీస్ జర్నీ ఏ రేంజ్ కు తీసుకెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News