పెద్ది సర్ ప్రైజ్: పవర్ఫుల్ బౌలర్ ఇతనే!
ఇక రాంబుజ్జి బౌలింగ్ లో పెద్ది ఎలాంటి షాట్స్ ఆడతాడో చూడాలి. ఈ సినిమాలో దివ్యేందు ఓ బలమైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.;

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా పెద్ది పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో సమాజం, కుటుంబం, నైతిక విలువలు కూడా హైలెట్ కానున్నట్లు టాక్ వస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రామ్ చరణ్ పాల్గొన్న యాక్షన్ సీన్ షూట్‌తో పాటు ఈ సినిమా నుండి కీలకమైన పాత్రల పరిచయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. వీటిలోనే ఒకటి బాలీవుడ్ స్టార్ దివ్యేందు శర్మ పోషిస్తున్న 'రాంబుజ్జీ' పాత్ర.
రీసెంట్‌గా దివ్యేందు బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దివ్యేందు సీరియస్ లుక్‌తో కనిపిస్తూ.. చేతిలో బాల్ ను తిప్పుతుంటారు. మెలికలు తిరిగే పాత్రగా, మాస్‌కు మైండ్‌గేమ్స్ ఆడే క్యారెక్టర్‌గా ‘రాంబుజ్జీ’ ఆకర్షణీయంగా ఉండబోతుందని అర్థమవుతోంది. పెద్ది సినిమాలో ఇది ఒక సరికొత్త డైమెన్షన్‌ను తీసుకొస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇక రాంబుజ్జి బౌలింగ్ లో పెద్ది ఎలాంటి షాట్స్ ఆడతాడో చూడాలి. ఈ సినిమాలో దివ్యేందు ఓ బలమైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ కనిపించబోతుంది. జాన్వీ కపూర్ కథానాయికగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దివ్యేందు లాంటి విలన్ పాత్ర మరింత థ్రిల్ ఇవ్వబోతోంది.
రామ్ చరణ్ సరసన సీరియస్ కాన్ఫ్లిక్ట్‌లకు కారణమయ్యే పాత్రగా రాంబుజ్జీ ఉండబోతున్నాడని టాక్. బుచ్చి బాబు శైలిలో విలన్ పాత్రలకు డెఫినిషన్ ఎలా ఉంటుందో ఉప్పెన సినిమాలో చూశాం. అలాంటి ఎమోషనల్ డెప్త్‌తో, మాస్ ఇంపాక్ట్‌తో రాంబుజ్జీ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగా దివ్యేందు కూడా తన క్యారెక్టర్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారట.
ఈ చిత్రం 2026 మార్చి 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా రాంబుజ్జీ పోస్టర్ ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మరి దివ్యేందు ఈ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతాడో, రాంబుజ్జీ పాత్ర ఎలాంటి హైప్ ను క్తియేట్ చేస్తుందో చూడాల్సిందే.