'పెద్ది' క్లైమాక్స్ ఉత్తరాంధ్రాలోనా!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` భారీ అంచనాల మద్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడుగా బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` భారీ అంచనాల మద్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు...మూడు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. మైసూర్, హైదరాబాద్, మారేడిమిల్లి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కి చేరాయి. రామ్ చరణ్ మాస్ లుక్... గ్లింప్స్ ప్రతీది ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.
క్రికెట్, కుస్తీ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రముఖంగా ఉత్తరాంద్రా క్రీడల నేపథ్యమ న్నది హైలైట్ అయింది. దీనిలో భాగంగా ఉత్తరాంద్ర ప్రాంతానికి చెందిన ఔత్సాహిక నటీనటుల్ని స్టార్ హంట్ పేరిట ఎంపిక చేసారు. చాలా మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. ఉత్తరాంద్ర యాస సిని మాలో హైలైట్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ని ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే చిత్రీకరిం చాలని బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడుట.
వాస్తవ వాతావరణంలో అయితే సన్నివేశాల్లో మరింత వాస్తవికత కనిపిస్తుందని ఇలా ప్లాన్ చేస్తున్నాడుట. అంటే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లోనే క్లైమాక్స్ షూట్ జరుగుతుందని....ఆ సమ యంలో ఈ ప్రాంత వాసులు తెరపై కనిపిస్తారని తెలుస్తోంది. బుచ్చిబాబు తొలి సినిమా `ఉప్పెన` తీర ప్రాంతం నేపథ్యంలో సాగే స్టోరీ కావడంతో కాకినాడ ఉప్పాడ ప్రాంతంలోనే చాలా భాగం షూటింగ్ చేసారు.
ఎలాంటి సె ట్లు లేకుండా రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించారు. సినిమాలో ఆ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. పెద్ది క్లైమాక్స్ విషయంలో కూడా అదే విధానంలో వెళ్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో ప్రత్యే కంగా ఏ ప్రాంతాల్లో చిత్రీకరిస్తారు? అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది.