పెద్ది బాక్సాఫీస్.. దేవరను ఫాలో ఆవాల్సిందే?

పెద్ది మొదటి వీకెండ్‌ని ఫుల్లుగా వాడుకుంది. మూడు రోజుల్లో ఊహించని మార్క్‌ని టచ్ చేసేలా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ టాక్.

Update: 2026-06-08 05:20 GMT

పెద్ది మొదటి వీకెండ్‌ని ఫుల్లుగా వాడుకుంది. మూడు రోజుల్లో ఊహించని మార్క్‌ని టచ్ చేసేలా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ టాక్. ఇక ఓపెనింగ్స్ విషయంలో రామ్ చరణ్ స్టామినా మరోసారి ప్రూవ్ అయ్యింది. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. సోమవారం నుంచి వీక్‌డేస్ రన్ ఎలా ఉంటుందో దాన్నిబట్టే లాంగ్ రన్ డిసైడ్ అవుతుంది. వీకెండ్ హైప్ ఒక్కటే సరిపోదు.

సినిమా కంటెంట్ మీద భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయనేది వాస్తవం. కొందరు ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యిందంటుంటే, మరికొందరు సెకండాఫ్‌లో ల్యాగ్ ఉందని అంటున్నారు. హీరోయిన్ క్యారెక్టర్‌ రొటీన్ గా ఉందనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. ఇలాంటి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది కీలకం. ఇక్కడే దర్శకుడు బుచ్చిబాబు వెంటనే స్పందించడం ప్లస్ అయ్యింది.

రిలీజ్ తర్వాత వచ్చిన కొన్ని విమర్శలపై బుచ్చిబాబు ఓపెన్‌గా మాట్లాడాడు. సినిమా ఉద్దేశం, తాను తీసుకున్న కొన్ని క్రియేటివ్ డెసిషన్స్‌ని వివరించాడు. డైరెక్టర్ ఇలా ముందుకొచ్చి రెస్పాండ్ అవ్వడం ఆడియన్స్‌కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సైలెంట్‌గా ఉంటే నెగిటివ్ నెరేటివ్ స్ప్రెడ్ అవుతుంది. బుచ్చిబాబు టైమ్‌కి స్పందించడం ‘పెద్ది’కి ఫస్ట్ పాజిటివ్ స్టెప్.

ఇదే పరిస్థితి గతేడాది ‘దేవర’కు కూడా ఎదురైంది. ఫస్ట్ డే టాక్ డివైడ్ అయ్యింది. వెంటనే ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు. వరుస ఇంటర్వ్యూలతో సినిమా స్ట్రాంగ్ పాయింట్స్ జనాల్లోకి తీసుకెళ్లాడు. మేకర్స్ కూడా సీన్ కట్ చేసి కొత్త టీజర్లు, బెస్ట్ షాట్స్‌తో కూడిన ప్రోమోలు వదిలారు. ట్రోలింగ్ జరుగుతున్న టైమ్‌లోనే పాజిటివ్ యాంగిల్‌ని హైలైట్ చేశారు. దాని రిజల్ట్ క్లైమాక్స్ వీక్‌లో కనిపించింది. ‘దేవర’ వీక్‌డేస్‌లో నిలబడి బ్లాక్‌బస్టర్ అయ్యింది.

‘పెద్ది’ టీమ్ కూడా ఇప్పుడు ‘దేవర’ రూట్‌నే ఫాలో అవ్వాలి. రామ్ చరణ్ ప్రమోషన్స్‌లో యాక్టివ్ అవ్వడం, బుచ్చిబాబు మీడియా ముందుకు రావడం, బెస్ట్ ఎమోషనల్ సీన్స్, మాస్ మూమెంట్స్‌ని మళ్లీ కట్ చేసి వదలడం చేయాలి. నెగిటివ్ కామెంట్‌ని డిఫెండ్ చేయడం కంటే, సినిమాలో ఉన్న పాజిటివ్‌ని ఎక్కువ మందికి చేరవేయడమే ఇప్పుడు కావాలి.

వీకెండ్ కలెక్షన్లు ఎంత వచ్చినా సోమవారం నుంచి గ్రాఫ్ స్టడీగా మెయింటైన్ చేయడమే అసలు సక్సెస్. ‘దేవర’ టీమ్ వీక్‌డేస్‌లో చేసిన హార్డ్ వర్క్ వల్లే ఆ సినిమా సేఫ్ అయ్యింది. ‘పెద్ది’కి కూడా అదే ఫార్ములా వర్కౌట్ అవుతుంది. కంటెంట్‌లో ఉన్న బలాన్ని బయటికి తీస్తే, బుచ్చిబాబు రెస్పాన్స్‌ని కంటిన్యూ చేస్తే, ఈ వారం టెస్ట్‌లో కూడా పాస్ అవ్వడం ఖాయం. చూడాలి మరి మేకర్స్ అడుగులు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News