రామ్ చరణ్ 'పెద్ది'.. 4 రోజుల లెక్క ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది.

Update: 2026-06-08 06:45 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఆదివారం ఒక్కరోజే రూ.55.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం, త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.



 


ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్‌ లో ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయింది. దీంతో ఇప్పుడు పెద్ది మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా కనిపించింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంది.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఏపీ, తెలంగాణలోని మెయిన్ సెంటర్స్ లో థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి కొనసాగుతోంది. మాస్ ఎలిమెంట్స్, విలేజ్ బ్యాక్ డ్రాప్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

మూడు రోజుల్లోనే రూ.236 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసిన పెద్ది చిత్రం, నాలుగో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ముఖ్యంగా వీకెండ్ చివరి రోజు అయిన ఆదివారం వసూళ్లు శనివారంతో పోలిస్తే మరింత పెరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్‌ లో సాలిడ్ వసూళ్లు నమోదు కావడం సినిమాకు పెద్ద ప్లస్‌ గా మారింది.

ఓవర్సీస్ లో కూడా పెద్ది ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌ లో ఆ సినిమా ఇప్పటివరకు 2.9 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఓవర్సీస్‌ లో కూడా రామ్ చరణ్‌ కు ఉన్న క్రేజ్ మరోసారి కనిపించిందని చెప్పాలి. అయితే పెద్ది మూవీతో రామ్ చరణ్ తన కెరీర్‌ లో మరో అరుదైన మైల్ స్టోన్ అందుకున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రంగస్థలం చిత్రాలతో భారీ వసూళ్లు అందుకున్న ఆయన, ఇప్పుడు పెద్దితో మరోసారి రూ.200 కోట్ల క్లబ్‌ లో చోటు సంపాదించారు.

సోలో హీరోగా విడుదలైన తొలి రోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో కూడా పెద్ది స్థానం దక్కించుకుంది. ఇక సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన పాత్రపై సోషల్ మీడియాలో చర్చలు జరిగినప్పటికీ, వాటి ఎఫెక్ట్ వసూళ్లపై కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రేక్షకుల దృష్టి కథ, చరణ్ యాక్టింగ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ పైనే నిలిచినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ వీకెండ్‌ ను సక్సెస్ ఫుల్ గా ముగించిన పెద్దికి అసలు పరీక్ష ఇప్పుడు వర్కింగ్ డేస్‌ లో ఉండనుంది. సోమవారం నుంచి కూడా ఇదే రేంజ్ లో ఆడియన్స్ రెస్పాన్స్ కొనసాగితే సినిమా మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ ను బట్టి చూస్తే పెద్ది త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌ లోకి అడుగుపెట్టడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News