• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉస్తాద్ భగత్ సింగ్.....

ఉస్తాద్ భగత్ సింగ్.. స్పీడ్ పెంచిన పవర్ స్టార్ టీమ్

| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అత్యున్నత బాధ్యతలో కొనసాగుతున్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా సినిమాలకూ సమయం కేటాయిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-08-10 17:05 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అత్యున్నత బాధ్యతలో కొనసాగుతున్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా సినిమాలకూ సమయం కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు.

ఈ సినిమా కు సంబంధించిన క్లైమాక్స్‌తో పాటు ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. లేటెస్ట్ గా చిత్రబృందం ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను షేర్ చేసింది. జూలై 26 తేదీతో ఉన్న క్లాప్‌బోర్డ్ ఫోటోను రిలీజ్ చేస్తూ, ఎడిటింగ్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోందని ప్రకటించారు. ఈ స్టిల్ పవన్ క్లైమాక్స్ సన్నివేశాల సమయంలో తీసింది. అందులో పవన్ లుక్‌ను పూర్తిగా రివీల్ చేయకపోవడం ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్, శ్రీలీలపై చిత్రీకరించిన పాట ఇప్పటికే బృందానికి ప్రత్యేకంగా నచ్చిందని టాక్. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మాస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని అంశాలూ ఉంటాయని టీమ్ నమ్మకంగా చెబుతోంది. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండటంతో పాటలపై కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. సెప్టెంబర్‌కి ముందు మొత్తం చిత్రీకరణను పూర్తిచేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రమోషన్లను ఆగ్రెసివ్‌గా ప్రారంభించనున్నారు. ఈ సినిమా పవన్‌కు మాస్ మార్కెట్‌లో మరోసారి బాక్సాఫీస్ దూకుడు తెచ్చిపెడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.

‘గబ్బర్ సింగ్’ తరహా ఎనర్జీ, పవన్ మార్క్ స్టైల్, హరీష్ శంకర్ పంచ్ డైలాగ్స్ కలిసొచ్చేలా ఈ ప్రాజెక్ట్‌ను తయారు చేస్తున్నారని సమాచారం. ఎడిటింగ్ రూమ్ నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ కూడా చాలా పాజిటివ్‌గా ఉందట. ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులంతా థియేటర్లలో ఈ మాస్ ఫీస్ట్ కోసం రోజులు లెక్కపెడుతున్నారు. ఇక నెక్స్ట్ పవన్ OG కూడా లైన్ లో ఉన్న విషయం తెలిసిందే.

Tags:    
  • UstaadBhagatSingh 
  • HarishShankar 
  • Pawankalyan 
  • Tollywood 
  • MythriMovieMakers 
  • DeviSriPrasad 
  • Sreeleela 
  • RaashiiKhanna 
  • UstaadBhagatSinghUpdate 
  • పవర్ స్టార్ 
  • పవన్ కళ్యాణ్ 
  • హరీష్ శంకర్ 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS