ఉస్తాద్ భగత్ సింగ్ లో భారీ మార్పులా?
పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.;
పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ కాంబినేషన్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రకటించగానే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో ఇద్దరి కాంబోలో రిలీజ్ అయిన 'గబ్బర్ సింగ్' భారీ విజయం సాధించడంతో పాటు, అందులో పవన్ పోలీస్ పాత్ర కమర్శియల్ గా వర్కౌట్ అవ్వడంతో? ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది. అభిమానులు మెచ్చిన గొప్ప చిత్రమైంది. 'గబ్బర్ సింగ్' గెటప్స్ లో అభిమానులు పవన్ పొలిటికల్ మీటింగ్ ల్లో ఏ రేంజ్ లో హైలైట్ అయ్యారో తెలిసిందే.
అప్పటికి పవన్ ఎలాంటి రాజకీయాలు చేయలేదు కాబట్టి పాత్రతో పనిలేకుండా డైరెక్టర్ హీరోగా పనిచేసాడు. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటించగానే మరో బ్లాక్ బస్టర్ ఖాయమంటూ అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే హరిహరి మల్లు...ఓజీ రిలీజ్ అవుతున్నా? ఉస్తాద్ పై మాత్రం అభిమానులకు ప్రత్యేకమైన ప్రేమ ఉందన్నది కాదనలేని వాస్తవం. పవన్ పాత్ర మరోసారి పీక్స్ లో ఉండబోతుందని అంచనాలున్నాయి.
అయితే ఈసారి పవన్ అంత ఛాన్స్ హరీష్ కు ఇవ్వడం లేదని తాజాగా అందుతోన్న సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ లో తన పాత్రను మాస్ కంటే క్లాసీగా ఉండాలని తాజాగా ఆదేశించారట పవన్. గబ్బర్ సింగ్ తరహాలో ఏమాత్రం ఉండకూడదని... టైటిల్ కు తగ్గట్టు ఆదర్శంగా ఉండాలని అలా వచ్చేలా పాత్రలో మార్పులు చేయాల్సిందిగా కోరారట. దీంతో హరీష్ కూడా స్టోరీని ఏం టచ్ చేయకుండా పాత్రలో పవర్ నెస్ తగ్గిస్తున్నాడని సమాచారం.