'గ‌బ్బ‌ర్ సింగ్' టైప్ ట్రై చేస్తే క‌ష్ట‌మే!

రొటీన్ సినిమాల‌ను అంగీక‌రించ‌డం లేదు. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా? అందులో కొత్త‌ద‌నం ఏంటి? అన్న‌ది విశ్లేషిస్తున్నారు.;

Update: 2025-10-25 23:30 GMT

13 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన `గ‌బ్బ‌ర్ సింగ్` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ప‌వ‌న్ కళ్యాణ్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ చిత్రంగా మిగిలిపోయింది. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కి ఈ విజ‌యం గొప్ప పేరు తీసుకొచ్చింది. ప‌వ‌న్ మ్యాన రిజ‌మ్..హ‌రీష్ డైలాగులు..కామెడీ పంచ్ ల‌తో సాగిన చిత్రానికి ప్రేక్ష‌కాభిమానులు బ్ర‌హ్మ‌రదం ప‌ట్ట‌డంతోనే అంత గొప్ప విజ‌యం సాధ్య‌మైంది. ఇదంతా అప్పటి జ‌న‌రేష‌న్..అప్ప‌టి ప‌వ‌న్ ఫాలోయింగ్ ఆధారంగా సాధ్య మైంది? అన్న‌ది కాద‌న‌లేని నిజం. ఇప్పుడు అదే కాంబినేష‌న్ లో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా అంచ‌నాలు ఆకాశాన్నంటున్నాయి.

ప్రేక్ష‌కుల అభిరుచి మారిన వేళ‌:

ఎందుకు ఇంత బ‌జ్ అంటే? `గ‌బ్బ‌ర్ సింగ్` కాంబినేష‌న్ కావ‌డంతోనే అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమా సాధించిన వ‌సూళ్లు...ప‌వ‌న్ ఇమేజ్ మాస్ కి క‌నెక్ట్ అవ్వ‌డం వంటి అంశాలే ఈ రేంజ్లో బ‌జ్ కి కార‌ణ‌మ‌య్యాయి. మ‌రి అదే త‌ర‌హా సినిమా ఇప్పుడు తీస్తే వ‌ర్కౌట్ అవుతుందా? అంటే అంత సుల‌భం కాద‌న్నది కాద‌న‌లేని నిజం. `గ‌బ్బ‌ర్ సింగ్` అన్న‌ది 13 ఏళ్ల క్రితం నాటి క‌థ. `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` కూడా అలాంటి క‌థ అయితే క‌నెక్ట్ అవ్వ‌డం క‌ష్ట‌మ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. టాలీవుడ్ సినిమా ట్రెండ్ పూర్తిగా మారింది. ప్రేక్ష‌కుల అభిరుచుల్లో ఎన్నో మార్పులొచ్చాయి.

ఎంత కొత్త‌గా చూపించ‌బోతున్నాడు:

రొటీన్ సినిమాల‌ను అంగీక‌రించ‌డం లేదు. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా? అందులో కొత్త‌ద‌నం ఏంటి? అన్న‌ది విశ్లేషిస్తున్నారు. హీరో ఇమేజ్ ని ప‌క్క‌న బెట్టి సినిమాను ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి రోజుల్లో `గబ్బ‌ర్ సింగ్` త‌ర‌హా ఎలివేష‌న్ ప‌వ‌న్ ట్రై చేస్తే వ‌ర్కౌట్ అవుతుందా? అన్న‌ది చాలా మందిలో క‌లుగుతోన్న సందేహం. `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` ద్వారా హ‌రీష్ ఏం చెప్పాల‌న‌కున్నా? అది కొత్త‌గా ఉండాలి. ప‌వ‌న్ మార్క్ ఇమేజ్ ఎక్క‌డా డీవియేట్ అవ్వ‌కుండా కొత్తగా చెప్పాలి. మ‌రి అది హ‌రీష్ తో సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది చూడాలి.

వ‌రుస ప్లాప్ చిత్రాల త‌ర్వాత‌:

హ‌రీష్ శంక‌ర్ కూడా వ‌రుస ప్లాప్ ల్లో ఉన్నాడు. నిజానికి `గబ్బ‌ర్ సింగ్` త‌ర్వాత ఆ రేంజ్ హిట్ హ‌రీష్ కి మ‌రోటి లేదు. `రామ‌య్యా వ‌స్తావ‌య్యా` ప్లాప్ అయింది. ఆ త‌ర్వాత చేసిన `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్` యావ‌రేజ్ గా ఆడింది. అటుపై డైరెక్ట్ చేసిన `దువ్వాడ జ‌గ‌న్నాధం`, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` యావ‌రేజ్ గా ఆడాయి. రీసెంట్ రిలీజ్ `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్` కూడా ప్లాప్ అయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా హ‌రీష్ శంక‌ర్ ఉన్నా? ప‌వ‌న్ ఎంతో న‌మ్మ‌కంతో మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. మ‌రి ఆ న‌మ్మ‌కాన్ని ఎంత కొత్త‌గా ట్రై చేసి నిల‌బెట్టుకుంటాడో చూడాలి. సినిమా రిలీజ్ 2026లో ఉంటుంది.

Tags:    

Similar News