సాగర్ కొత్త చిత్రం 'ది 100'.. ట్రైలర్ లాంచ్ కోసం పవర్ స్టార్!
‘ది 100’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది.;
టెలివిజన్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ఆర్‌కే సాగర్, ‘మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడుగా అందరి మనసుల్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ సీరియల్ సక్సెస్‌తో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తరువాత హీరోగా మారిన సాగర్, ‘సిద్దార్థ’, ‘షాదీ ముబారక్’ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్లీ హీరోగా ఓ మాస్ పోలీస్ స్టోరీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
‘ది 100’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాగర్, విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ మరియు ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్‌లో సాగర్ పవర్‌ఫుల్ లుక్‌లో అదిరిపోయాడు.
ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 5న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేయనున్నారు. ఇది సినిమాకు అదనపు బజ్‌ను తీసుకురావడం ఖాయం. పవన్ కళ్యాణ్ స్వయంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయనుండడం వల్ల ఈ సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్ లో మంచి హైప్ ఏర్పడింది. పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు అభిమానుల్లో ఉత్సాహం నింపుతుందనే విషయం తెలిసిందే. ట్రైలర్ లాంచ్ తో సినిమాకు మరింత హైప్ ఏర్పడే అవకాశం ఉంది.
‘ది 100’ చిత్రం జూలై 11న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఇద్దరూ టెక్నికల్‌గా సినిమాకు బలాన్ని చేకూర్చేలా ఉన్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలకు బీజెమ్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం స్పెషల్.
పోలీసుల జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వ్యక్తిగత బాధ్యతలు, డ్యూటీకి మధ్య జరిగే భావోద్వేగాలపై సినిమా దృష్టి పెడుతుందనే టాక్ వినిపిస్తోంది. సాగర్ విభిన్న పాత్రలో నటించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మంచి కథ, టెక్నికల్ బలంతో పాటు పవన్ కళ్యాణ్ స్పెషల్ సపోర్ట్ సినిమాకు మరింత హైప్‌ను తీసుకొస్తోంది. కెరీర్‌లో మరో బిగ్ హిట్ కొట్టాలని చూస్తున్న సాగర్ కు ‘ది 100’ మూవీ, తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ని ఇస్తుందో చూడాలి.