పవన్ కళ్యాణ్ వదులుకున్న బ్లాక్ బస్టర్ చిత్రాలివే!

ప్రముఖ డైరెక్టర్ కే.విజయ్ భాస్కర్ 'నువ్వే కావాలి' సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కోసమే రూపొందించారట.;

Update: 2025-09-02 17:30 GMT

దర్శకులు ఎవరైనా కథలు తయారు చేసుకునేటప్పుడు మొదటగా ఫలానా హీరోను దృష్టిలో పెట్టుకొని కథను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ కథను సదరు హీరోకి వినిపించినప్పుడు.. నచ్చితే వారు ఓకే చెబుతారు. లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ చేసిన కథలతో ఇంకొక హీరో చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పవన్ కళ్యాణ్ తన వద్దకు వచ్చిన ఎన్నో చిత్రాలను వదులుకోగా.. ఆ చిత్రాలను వేరే హీరోలు చేసి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన సినీ కెరియర్ లో వదులుకున్న ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

పవన్ కళ్యాణ్ ఒకవైపు హీరోగా.. మరొకవైపు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన తన 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ కాగా.. అందులో ఒకటి ఇది.. మరి పవన్ కళ్యాణ్ వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ చిత్రాలు..

నువ్వే కావాలి..

ప్రముఖ డైరెక్టర్ కే.విజయ్ భాస్కర్ 'నువ్వే కావాలి' సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కోసమే రూపొందించారట. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అదే కథతో తరుణ్ హీరోగా సినిమా చేసి.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా కూడా నిలిచింది.

అతడు:

జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మాతగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'అతడు'. ఈ సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కు చెప్పారట. కానీ కొన్ని కారణాల చేత ఆ ప్రాజెక్టు మహేష్ బాబు చేతికి చేరి మంచి విజయం అందుకుంది. నిజానికి ఈ సినిమా థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాకపోయినా.. టీవీలలో క్లాసిక్ హిట్ మూవీగా నిలిచింది. పైగా ఇటీవల రీ రిలీజ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి:

రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం అమ్మానాన్న ఓ తమిళమ్మాయి. ఈ సినిమా కథ కూడా మొదట పవన్ కళ్యాణ్ చేతికే వెళ్ళగా.. ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తిరస్కరించారట. కానీ ఈ చిత్రాన్ని రవితేజ చేసి మంచి విజయం అందుకున్నారు.

పోకిరి:

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ వదులుకున్న మరో చిత్రం పోకిరి. ఈ సినిమాని కూడా ముందుగా పవన్ కి వినిపించారట పూరీ జగన్నాథ్. కానీ పవన్ కళ్యాణ్ వదులుకున్నారు.అయితే ఈ సినిమాను మహేష్ బాబు చేసి తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఆల్ టైం రికార్డ్ సృష్టించింది పోకిరి మూవీ.

ఇడియట్:

మళ్లీ పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కి 'ఇడియట్' సినిమా కథను వినిపించగా.. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇది రవితేజ చేతికి వెళ్లి మంచి విజయం అందుకుంది.

విక్రమార్కుడు:

రాజమౌళి దర్శకత్వంలో సినిమాను కూడా పవన్ కళ్యాణ్ మిస్ చేసుకోవడం జరిగింది. మొదట విక్రమార్కుడు కథను కోసం రాజమౌళి పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్లు కేటాయించలేకపోయారు..ఇక ఈ చిత్రాన్ని రవితేజ చేసి మంచి విజయం అందుకున్నారు.

Tags:    

Similar News