పవన్ కళ్యాణ్ షర్ట్ విలువ తెలిస్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి వైరల్ అవుతూ ఆయన అభిమానులను ఆకట్టుకుంటుంది... ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఒక సాధారణమైన రెడ్ చెక్స్ షర్ట్ లో కనిపించారు.;
న్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి వైరల్ అవుతూ ఆయన అభిమానులను ఆకట్టుకుంటుంది... ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఒక సాధారణమైన రెడ్ చెక్స్ షర్ట్ లో కనిపించారు.
ఈ షర్ట్ చూడటానికి చాలా సింపుల్‌గా..రోజూ వేసుకునేలా ఉన్న.. ఆ షర్ట్ అభిమానులకు బాగా నచ్చడం వల్ల ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతూ ఉంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా..చాలా నేచురల్‌గా ఆయన ఆ లుక్‌ను క్యారీ చేయడం.. అందరి ప్రశంసలు పొందింది. దీంతో ఆ షర్ట్.. ఎక్కడ దొరుకుతుంది.. ఆ షర్ట్ ధర ఎంత అని అభిమానులు గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఆ షర్ట్ కాస్ట్.. తెలియగానే అభిమానులు కాస్త షాక్ కి గురవుతున్నారు.
ఎంతో సాధారణంగా కనిపించిన ఈ షర్ట్ ధర ఏకంగా వేలల్లో ఉంది. పవన్ కళ్యాణ్ వేసుకున్నది Polo Ralph Lauren క్లాసిక్ ఫిట్ ప్లెయిడ్ ఆక్స్ఫర్డ్ వర్క్ షర్ట్. దీని ధర సుమారు రూ.18,400 అని తెలుస్తోంది. బయటకు సాధారణంగా కనిపించినా..ఇంత ఖరీదైన షర్ట్ కావడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. పవన్ కళ్యాణ్ పెట్టగా ఫ్యాషన్ పైన శ్రద్ధ పెట్టకపోయినా.. నాణ్యత ఉన్న దుస్తులనే.. ఇష్టపడతారని.. ఈ ఫోటో మరోసారి రుజువు చేసింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్ కి.. ఖరీదైన Land Rover Defender కారును బహుమతిగా ఇచ్చారు. దాని విలువ సుమారు రూ.98 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో ఈ దర్శకుడికి ఈ గిఫ్ట్ ఇచ్చేటప్పుడే పవన్ కళ్యాణ్ ఈ షర్ట్ వేసుకొని వెళ్లారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి హరి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన..దేఖ్‌లేంగే సాలా.. పాటకు మంచి స్పందన వచ్చింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ కేవలం.. 24 గంటల్లోనే భారీ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. రామ్ చరణ్.. సినిమా ‘పెద్ది’లోని “చికిరి చికిరి” పాట మొదటి రోజు రికార్డును కూడా ఇది దాటేసింది.