పవన్ 'అడ్వాన్స్' కమిట్మెంట్.. ఇప్పుడు క్లియర్ అయినట్లేనా?

ఓజీతో భారీ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌ పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2026-06-24 18:30 GMT

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు, జనసేన కార్యక్రమాలు, ప్రజా సేవ.. ఇలా కొంచెం కూడా తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా సెట్స్‌ పైకి ఎప్పుడు వస్తారన్న ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ దొరికినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఓజీ 2కి సంబంధించి జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే.. పవన్ గతంలో ఇచ్చిన కమిట్మెంట్‌ ను ఆ ప్రాజెక్ట్ ద్వారానే పూర్తి చేసే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.

ఓజీతో భారీ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌ పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుందని ముందే ప్రకటించారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో పూర్తిగా బిజీగా ఉండటంతో ఓజీ 2 ఇప్పట్లో ప్రారంభం కావడం కష్టమేనని చాలా మంది భావించారు. కానీ రీసెంట్ గా మాత్రం అప్డేట్స్ అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి.

సుజీత్ ఫారిన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే కథా చర్చలు ప్రారంభమయ్యాయి. పవన్, సుజీత్ కలిసి స్క్రిప్ట్ డిస్కషన్స్‌ లో పాల్గొన్న ఫోటోలను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పంచుకోవడంతో ఆ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు వెళ్తోందనే సిగ్నల్స్ కనిపించాయి. దీంతో ఓజీ 2పై అభిమానుల్లో కొత్త జోష్ నెలకొంది. అయితే సీక్వెల్ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రచారం జోరుగా సాగుతోంది.

ఫస్ట్ పార్ట్ ను నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ స్థానంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ ప్రాజెక్టులో పార్టనర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణంగా పవన్ గతంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ కు ఇచ్చిన మాటను ప్రస్తావిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోసం పవన్ ఒక సినిమా చేస్తానని ముందుగానే అంగీకరించారని, అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారని వినకిడి.

అయితే రాజకీయ బాధ్యతల కారణంగా మరో ప్రాజెక్ట్ ప్రారంభించడం కంటే ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఓజీ 2 ద్వారానే ఆ కమిట్మెంట్‌ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఓజీ పార్ట్-2లో పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ కూడా సహ నిర్మాతగా ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

అసలు నిర్మాత ఎవరు? నిర్మాణ బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి? అన్న విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. పవన్ తన ప్రభుత్వ బాధ్యతల మధ్య కొంత సమయం కేటాయించి ఫస్ట్ స్టేజ్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం 2027లో పూర్తి స్థాయి షూటింగ్ జరగొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఏదేమైనా ఇప్పుడు ఓజీ 2 కేవలం సీక్వెల్ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన ఒక కీలక కమిట్మెంట్‌ కంప్లీట్ చేసే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు వినిపిస్తున్న ఒక్క ప్రశ్న.. పవన్ అడ్వాన్స్ కమిట్మెంట్ నిజంగానే ఓజీ 2తో క్లియర్ కాబోతుందా? అనే దానిపైనే. అభిమానులు కూడా అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News