యూఎస్‌ఏ రేసులో 'OG' ఫైనల్ రన్ ఎంత?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే, ముఖ్యంగా యూఎస్‌ఏ బాక్సాఫీస్ దగ్గర ఒకరకమైన వైబ్రేషన్ ఉంటుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే, ముఖ్యంగా యూఎస్‌ఏ బాక్సాఫీస్ దగ్గర ఒకరకమైన వైబ్రేషన్ ఉంటుంది. ఆయన క్రేజ్ వలన సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాకు డిమాండ్ గట్టిగానే ఉంటుంది. ఈసారి 'OG'తో పవన్ కచ్చితంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని, యూఎస్‌ఏ టాప్ 5 క్లబ్‌లో ఈజీగా అడుగుపెడతారని ఫ్యాన్స్ భారీ ముందే అంచనాలు పెట్టుకున్నారు.
అయితే 'OG' పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓపెనింగ్స్ నుంచి ఫైనల్ రన్ వరకు, ఇది ఆయన గత చిత్రాలన్నింటినీ దాటేసింది. కానీ, ఫ్యాన్స్ ఆశించిన మరో మ్యాజిక్ మాత్రం జరగలేదు. పవన్ స్టార్‌డమ్‌కు, సినిమాపై ఉన్న హైప్‌కు మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. ఇండస్ట్రీ దిగ్గజాలతో పోటీ పడటంలో 'OG' కాస్త వెనుకబడింది.
ఇప్పుడు 'OG' థియేట్రికల్ రన్ ముగింపు దశకు వచ్చేసింది. ఈ నెల 23న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా స్ట్రీమింగ్ కానుండటంతో, బాక్సాఫీస్ లెక్కలు ఫైనల్ అయ్యాయి. 'OG' చిత్రం నార్త్ అమెరికాలో ఫైనల్‌గా సుమారు 5.6 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ.47 కోట్లు) గ్రాస్‌తో తన ప్రయాణాన్ని ముగించింది. ఈ నంబర్‌తో 'OG' టాప్ 10 లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, టాప్ 5 క్లబ్‌లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది.
పోటీ పరంగా చూస్తే, 'OG' చిత్రం 'సైరా నరసింహారెడ్డి', 'హనుమాన్', 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసింది. ఇది ఒక గొప్ప విషయమే అయినా, ఎన్టీఆర్ నటించిన 'దేవర'ను మాత్రం క్రాస్ చేయలేకపోయింది. ఇక 'బాహుబలి 2', 'కల్కి', 'RRR', 'పుష్ప 2' వంటి ఇండస్ట్రీ హిట్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది.
ఇక 'OG' చాప్టర్ ముగియడంతో, ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' పైనే ఉన్నాయి. 'గబ్బర్ సింగ్' లాంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో, ఈసారైనా పవన్ యూఎస్‌ఏ టాప్ 5 క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మొత్తం మీద, పవన్ స్టార్‌డమ్ అన్‌డౌటెడ్. 'OG'తో దాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. కానీ, యూఎస్‌ఏ టాప్ 5 అనేది మాత్రం ఇంకా ఒక సవాల్‌గానే మిగిలిపోయింది. ఆ సవాల్‌ను 'ఉస్తాద్' అధిగమిస్తాడో లేదో చూడాలి.