ట్రైలర్ లీక్.. అసలు ప్లాన్ ఏంటీ?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ నటించిన ఓజీ మూవీ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ నటించిన ఓజీ మూవీ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా.. సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా మేకర్స్ ఓజీ కాన్సర్ట్ పేరుతో ఈవెంట్ ను నిర్వహించారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్డేడియంలో ఆ కార్యక్రమం జరగ్గా.. బీభత్సమైన వర్షం తీవ్రంగా దెబ్బేసింది. దీంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. కానీ పవన్ మాత్రం తన స్పీచ్ అండ్ స్వాగ్ తో అదరగొట్టారు. అదే సమయంలో తన అభిమానుల కోసం ట్రైలర్ ప్లే చేయించారు. నిజానికి ఓజీ మూవీ ట్రైలర్.. ఆదివారం ఉదయమే విడుదల కావాల్సి ఉంది.
కానీ మేకర్స్ రిలీజ్ చేయలేదు. ఈవెనింగ్ ఈవెంట్ లో విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అందుకు కూడా మేకర్స్ సిద్ధంగా లేరు. దీంతో ఏమైందని పవన్ కళ్యాణ్ వేదికపైనే ఆరా తీయగా.. డీఐ వర్క్ చేయాలని, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయని దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు.
కానీ పవర్ స్టార్ మాత్రం కచ్చితంగా రిలీజ్ చేయాలని పట్టుబట్టి వేదికపై ప్లే చేశారు. అయితే ట్రైలర్ అదిరిపోయిందని చెప్పాలి. ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చివరి షాట్ అయితే ఓ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఆయన డైలాగ్స్ అందరినీ కంప్లీట్ గా ఫిదా చేసేశాయి.
అయితే ట్రైలర్ ను మేకర్స్ ఇంకా అఫీషియల్ గా మాత్రం రిలీజ్ చేయలేదు. ఎప్పుడు చేస్తారో ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రైలర్ వీడియోస్ ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి. నిన్నటి ఈవెంట్ లో ప్లే చేసినప్పుడు.. అనేక మంది తమ మొబైల్స్ లో రికార్డ్ చేసి నెట్టింట లీక్ చేశారు.
దీంతో ట్రైలర్ కు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫుల్ కిక్ ఇచ్చేలా ట్రైలర్ ఉందని చెబుతున్నారు. బ్లాక్ బస్టర్ ట్రైలర్ కట్ అని కొనియాడుతున్నారు. కంప్లీట్ వర్క్ కాకపోవడంతో కాస్త క్వాలిటీ మాత్రం తక్కువగా ఉందని చెప్పాలి. మరి మేకర్స్ హెచ్ డీ క్వాలిటీలో ట్రైలర్ ను సోషల్ మీడియాలో అధికారికంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి.