ఓజిలో స్పెషల్ ఎట్రాక్షన్ అదేనట!
ఓజాస్ గంభీర అంటూ సాగే ఫస్ట్ సాంగ్ పవన్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ కు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్లో ఓజి సినిమాపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో సినిమా వస్తుందని అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా, సినిమా నుంచి గ్లింప్స్ వచ్చాక ఆ హైప్ ఇంకాస్త పెరిగింది. అందుకే ఓజికి సంబంధించిన ఎవరు ఎక్కడ కనిపించినా పవన్ ఫ్యాన్స్ సందర్భంతో పన్లేకుండా ఓజి ఓజి అని అరుస్తూ తెగ గోల చేశారు.
ఓజి ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. అందులో భాగంగానే మొన్నీ మధ్య ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ఆ సాంగ్ తో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నారు.
ఓజి సెకండ్ సింగిల్‌గా మెలోడీ
ఓజాస్ గంభీర అంటూ సాగే ఫస్ట్ సాంగ్ పవన్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ కు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఓజి నుంచి రెండో పాటగా మేకర్స్ ఓ మంచి మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటూ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా కనిపించనున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఓజి లో ఈ రొమాంటిక్ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని, ఈ సాంగ్ కు తమన్ ఇచ్చిన ట్యూన్ తో పాటూ పవన్- ప్రియాంకల కెమిస్ట్రీ ఈ సాంగ్ ను స్పెషల్ గా నిలబెడుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ మెలోడీ సాంగ్ ను నెక్ట్స్ వీక్ రిలీజ్ చేయనున్నారని, త్వరలోనే ఆ సాంగ్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వీలుందని తెలుస్తోంది.