OG: అసలు కన్ఫ్యూజన్ తీరింది!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హై అక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “ఓజి” సినిమాపై అభిమానుల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-06-21 07:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హై అక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “ఓజి” సినిమాపై అభిమానుల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తవుతూ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్న ఈ సినిమా, స్టైల్, మేకింగ్, పవన్ లుక్‌తో అప్పుడే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

గత ఏడాదే సినిమాను విడుదల చేయాలనుకున్నప్పటికి, రాజకీయ, ఇతర సినిమాల కారణంగా అది ఆలస్యం అయింది. అయితే ఇటీవల “హరిహర వీరమల్లు” విడుదలకు సంబంధించి ఒక క్లారిటీ రాకపోవడంతో “ఓజి” మూవీ రిలీజ్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరమల్లు ముందే వస్తుందా? అదే తేదీకి వస్తే ఓజి వాయిదా పడిపోతుందా? అనే ప్రశ్నలు అభిమానులను కలవరపెట్టాయి.

రెండు కూడా బిగ్ బడ్జెట్ సినిమాలే కావడం వల్ల, ఒకదాన్ని మించి మరోదాన్ని ముందు రిలీజ్ చేయలేరు అని సినీ వర్గాలు అంటున్నాయి. వీటిలో ఓ సినిమా రిలీజ్ తాకిడితో మరొకటి దెబ్బ తినే అవకాశం ఉండటంతో స్పష్టత అవసరం అయింది. ఇప్పుడు ఫైనల్ గా "హరిహర వీరమల్లు" జూలై 24న విడుదల కానున్నట్లు అధికారిక పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

దీంతో “ఓజి”కి దారి సాఫీ అయినట్టే. OG హైప్‌కి ఎలాంటి ఆటంకం లేకుండా మేకర్స్ ప్లాన్ ప్రకారం రిలీజ్‌కి వెళ్లే అవకాశం లభించింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో OG ఫ్యాన్స్ భారీగా సెలబ్రేట్ చేస్తున్నారు. OG సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా, ఎమోషన్‌తో కూడిన యాక్షన్ కథతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

ముంబై గ్యాంగ్‌బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్టైలిష్ కథాంశంతో ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్ పవన్ హావభావాలతో ట్రెండ్ క్రియేట్ చేయగా, మిగతా ప్రమోషనల్ మెటీరియల్‌పై భారీ అంచనాలున్నాయి. OG విడుదలకు సంబంధించి త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇస్తారని సమాచారం. ఇప్పటికి OG రిలీజ్ పై ఉన్న సందిగ్ధత తొలిగిపోయింది. ఇప్పుడు OG ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News