OG ఓటీటీ ఆడియన్స్ రియాక్షన్ ఏంటి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా థియేట్రికల్ రన్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తెచ్చింది. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ ఇచ్చింది.;

Update: 2025-10-25 03:46 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా థియేట్రికల్ రన్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తెచ్చింది. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ ఇచ్చింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయనను ఎలా చూడాలని అనుకున్నారో దానికి ఏమాత్రం తగ్గకుండా సుజీత్ టేకింగ్ ఉంది. ఓజీ థియేటర్ హంగామా ముగిసింది. పవర్ స్టార్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ తో సినిమా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీ రిలీజైంది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యింది.

ఓటీటీ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన..

ఓజీ సినిమా థియేట్రికల్ రన్ లో మిస్ అయిన ఆడియన్స్ డిజిటల్ రిలీజ్ తర్వాత చూసి సినిమా గురించి రెస్పాండ్ అవుతున్నారు. ఫ్యాన్స్ కి ఫీస్ట్ అంటూ హంగామా చేసిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమాలో పవర్ స్టార్ ఎలివేషన్స్ కి సుజీత్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కథ, కథనాల మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని అంటున్నారు.

ఐతే థియేట్రికల్ రన్ హిట్టైనా ఓటీటీ ఆడియన్స్ అసలైన రెస్పాన్స్ ఇస్తారు. సినిమాలో థమన్ మ్యూజిక్ అదరగొట్టేశాడని అంటున్నారు. తన డ్యూటీ వరకు థమన్ నెక్స్ట్ లెవెల్ లో చేశాడని.. థమన్ నుంచి ఈ వర్క్ సుజీత్ చాలా బాగా చేయించుకున్నాడని అంటున్నారు. మొత్తానికి ఓజీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అదే ఓటీటీ టాక్ మిక్సెడ్ రెస్పాన్స్ గా ఉంది.

సుజీత్ నెక్స్ట్ నానితో సినిమా..

పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఓటీటీలో కూడా ఈ సినిమాను హిట్ చేసేలా ప్రమోట్ చేస్తున్నారు. ఐతే ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ని ఇలా చూపించిన సందర్భాలు లేవు. ఆ విషయంలో డైరెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఓజీ అయిపోయింది ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత సుజీత్ నెక్స్ట్ నానితో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందట. ఆ సినిమాను బ్లడీ రోమియో అనే టైటిల్ అనుకుంటున్నారట.

నాని సినిమా తర్వాత అయినా పవన్ కళ్యాణ్ ఓజీ 2 ఉంటుందా లేదా మరో సినిమా చేశాక ఈ కాంబినేషన్ ట్రై చేస్తారా అన్నది చూడాలి. సుజీత్ మాత్రం నాని సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఉంటుందని తెలుస్తుంది.

Tags:    

Similar News